సారీ..దాని కోసం ఆర్డినెన్స్ ఇవ్వలేము: కేంద్రం

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతీ ఏటా ఆనవాయితీగా నిర్వహించే జల్లికట్టు క్రీడ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన తరువాత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దీని కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేయవలసిందిగా అభ్యర్ధిస్తూకేంద్రానికి ఒక లేఖ వ్రాసారు. కానీ అది సాద్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తమిళనాడు ప్రభుత్వ మరియు ప్రతిపక్షాల అభ్యర్ధన మేరకు జల్లికట్టు క్రీడ నిర్వహణకు మేము నోటిఫికేషన్ జారీ చేసాము. కానీ సుప్రీం కోర్టు దానిపై స్టే విధించింది. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో ఉంది. కనుక ఇటువంటి సమయంలో మేము మళ్ళీ జల్లికట్టు క్రీడా నిర్వహణ కోసం కొత్తగా నోటిఫికేషన్ లేదా ఆర్డినెన్స్ జారీ చేయలేము,” అని చెప్పారు.

జల్లికట్టు క్రీడ నిర్వహించకుండా సుప్రీం కోర్టు స్టే విదించడంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనేక శతాబ్దాలుగా జల్లికట్టు క్రీడని రాష్ట్ర ప్రజలు సంక్రాంతి సందర్భంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, సుప్రీం కోర్టు దానిని నిలిపివేయాలనుకోవడం సరయిన నిర్ణయం కాదని వాదిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు దీనిని ఒక అవకాశంగా తీసుకొని రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, అధికార అన్నాడిఎంకె పార్టీ, అటూ సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కాదని జల్లికట్టు క్రీడను అనుమతించలేక, ప్రజలని కాదనలేక చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కనుక ఇటువంటి ప్రతీ అంశమూ రాజకీయం అవుతూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలు తలెత్తితే అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీపై ఆ దుష్ప్రభావం ఎంతో కొంత తప్పక ఉంటుంది కనుక ఇందులో తన తప్పు, నిర్లక్ష్యం ఏమీ లేదని ప్రజలకు నచ్చజెప్పుకొనేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హడావుడిగా కేంద్రప్రభుత్వానికి లేఖ వ్రాసి నోటిఫికేషన్ ఇప్పించుకొన్నారు. కానీ దానిపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పుడు బంతి మళ్ళీ మోడీ కోర్టులోనే పడినట్లయింది. అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకొని ఈసారి ఎన్నికలలో కొన్ని సీట్లు గెలుచుకొని తమిళనాడులో కూడా నిలద్రొక్కుకోవాలని ఆశిస్తున్న బీజేపీకి కూడా దీని వలన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసివస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close