[X] Close
[X] Close
Home Contributor Network చైతన్య : బాదుడు ఉండదని మేనిఫెస్టోలో చెప్పారా..?

చైతన్య : బాదుడు ఉండదని మేనిఫెస్టోలో చెప్పారా..?

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచార సభల్లో చంద్రబాబు మళ్లీ గెలిస్తే.. ఎలా బాదుతారో.. వివరంగా చెప్పారు. ఆయన మాటలను ప్రజలు బలంగానే నమ్మారు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ బాదుళ్లన్నీ ఆగిపోయాయా అంటే.. లేనే లేదు. ఎనిమిది నెలల్లోనే…చంద్రబాబు బాదేస్తాడని.. చెప్పిన అన్నింటిలోనూ బాదేశారు.

ఎనిమిది నెలలకే ఎన్నెన్ని బాదుళ్లో..!

ప్రజల దగ్గర చంద్రబాబు సర్కార్ పన్నులు బాదేస్తోందని ఆవేశపడిన జగన్… ఆయన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో ఉన్న పన్నును కూడా ఉంచకుండా.. ఆదాయం కోసం మరింతగా పెంచారు. జగన్ ఆధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఇసుక, మద్యం, ఆర్టీసీ , కరెంట్, పెట్రోలు ఇలా… అన్నింటిపై భారం వేసేశారు. ఎలా లేదన్నా… వీటిపై పన్నుల ద్వారా.. పది నుంచి ఇరవై వేల కోట్ల వరకూ ప్రభుత్వం ప్రజల నుంచి పిండుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వడ్డనలు ఇంతటితో ఆగిపోలేదు.. ప్రభుత్వానికి చెందిన ఫైబర్ నెట్ వాడే వారికి వచ్చే నెల నుంచి మోత ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి మున్సిపల్ పన్నుల వరకూ.. చాలా బాదుళ్లు లైన్‌లో ఉన్నాయంటున్నారు

పథకాల పేరుతో ఇచ్చేది.. వడ్డీతో సహా వసూలు..!

చంద్రబాబు ఐదేళ్ల హయంలో.. దేనిపైనా పన్నులు పెంచలేదు. ఆర్థిక కష్టాలున్నా.. ప్రజలపై భారం మోపడం ఎందుకనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వానికి నిధుల కట కట ఎదురయింది. సంక్షేమం పేరుతో నగదు బదిలీ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతున్నాయి. వాలంటీర్లకు.. గ్రామ సచివాలయాలకు… సలహాదారులకు… పెద్ద ఎత్తున జీతాలు చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ మొత్తానికి నిధులు కావాలి. గత ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం 40వేల కోట్ల వరకూ అప్పులు చేసింది. ఈ అప్పులన్నీ పథకాలకు.. జీతాలకే పంచి పెట్టారు. ఒక్కటంటే.. ఒక్క అభివృద్ధి పనికీ ఖర్చు చేయలేదు. ఇప్పుడు.. ఏపీ జీడీపీ తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఫలితంగా.. ఏపీ ఆదాయం కూడా పడిపోయింది. ఆదాయానికి, ఖర్చుకు మధ్య పొంతన లేకపోవడంతో..వసూలయినంత ప్రజల వద్ద నుంచే పిండేస్తోంది. ప్రజలకు సంక్షేమం పేరుతో ఇచ్చిన డబ్బుల్నే.. ఇలా పన్నుల పెంపుతో రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాదుడు ఉండదని మేనిఫెస్టోలో పెట్టలేదుగా..?

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పిన దానికి.. ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదు. ఎవరైనా… ప్రశ్నిస్తే అధికార పార్టీ దగ్గర..రెడీమేడ్ ఆన్సర్ రెడీగా ఉంటుంది. అదే మేనిఫెస్టో. సన్నబియ్యం ఇస్తామని… 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీలు గతంలో ఎన్నో ఇచ్చారు. వాటి సంగతేమయిందని.. ఎవరైనా అడిగితే… మేనిఫెస్టోను చూపిస్తున్నారు… ముఖ్యమంత్రి దగ్గర్నుంచి … కింది స్థాయి నేతల వరకూ. ఆ హామీలు.. మేనిఫెస్టోలో ఉన్నాయేమో చూపించండి.. అని జగన్మోహన్ రెడ్డి కూడా.. అసెంబ్లీలో సవాల్ చేస్తున్నారు. అవన్నీ సరే.. ఇప్పుడు బాదుళ్లు ఎందుకని.. ఎవరైనా ప్రశ్నిస్తే.. నిర్మోహమాటంగా.. చార్జీలు పెంచబోమని మేనిఫెస్టోలో పెట్టామా.. అని ఎదురుదాడి చేసేస్తారు. దానికి సిద్ధమవ్వాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

తెలంగాణలో బహిరంగంగా ఉమ్మి వేసినా కేసు..!

వైరస్ అంకంతకూ వ్యాపిస్తూండటంతో తెలంగాణ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో పాన్‌, తంబాకు ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి...

ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యమే అసలు వైరస్..!

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్య సిబ్బందికి వైరస్ సోకింది. దీనికి కారణం.. పూర్తి నిర్లక్ష్యమే. హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. అయితే.. ఈ...

“మెడ్‌టెక్ జోన్” క్రెడిట్ కోసం వైసీపీ ఆరాటం..!

వైరస్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది విశాఖ మెడ్‌టెక్ జోన్. సాధారణంగా ఏపీలో  పొలిటికల్ క్రెడిట్ గేమ్స్ చాలా ఎక్కువ. ఇలాంటి ఓ అరుదైన...

HOT NEWS