‘అమరావతి’ మ్యాప్‌లో ఉంటే చాలా?

ఏపీ రాజధాని అమరావతి పరిస్థితి ఏమిటి? అమరావతి పేరు అలా పక్కన పెట్టండి. అసలు రాజధాని నిర్మాణం సంగతి ఏమిటి? రాష్ట్రం అన్న తరువాత దానికో రాజధాని ఉండాలి కదా. దాన్ని నిర్మించాలనే ఆలోచన, ఆతృత ఉండాలి కదా. మనిషికి పేరు ఎంత ముఖ్యమో రాష్ట్రానికి రాజధాని అంతే ముఖ్యం. తెలంగాణ అంటే ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్‌ చేసేది హైదరాబాద్‌. మరి ఏపీని రిప్రజెంట్‌ చేసేది ఏది? ఇప్పటివరకు ఏమీ లేదు. అమరావతి అనే పేరు మాత్రమే ఉంది. అది ఇంతటి ప్రాచుర్యంలోకి రావడానికి అధికారంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆ పేరుకు చేసిన ప్రచారం, కల్పించిన ప్రాచుర్యం. హైదరాబాదులా పెద్ద నగరం లేకపోయినా అది ఉన్నదన్న ఫీలింగ్‌ కలిగించాడు చంద్రబాబు. ఇది ఆయన ప్రచార నైపుణ్యం వల్లనే సాధ్యమైంది.

అదే సమయంలో అతి ప్రచారం చేసి అమరావతిని భ్రమరావతి అనే విమర్శలపాలూ చేశాడు. ప్రపంచంలోని ఐదు గొప్ప రాజధానుల్లో ఇదొకటి అన్నాడు. హైదరాబాదును మించుతుందన్నాడు. ‘అంతన్నాడింతన్నాడే’ అనే పాట మాదిరిగా తయారుచేశాడు. ప్రజలను ఊహల్లో తేలించడంతో, దేశదేశాలు తిరగడంతో, అంత గొప్ప నగరం…ఇంత గొప్ప నగరం అని ప్రచారం చేయడంతోనే ఆయన టర్మ్‌ ముగిసిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చివుంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి.

జగన్‌ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం లూప్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. యధా రాజా…తథా ప్రజా అన్నట్లుగా రాజధాని నిర్మాణం విషయంలో జగన్‌ ఆలోచనలను అనుసరించి మంత్రులు రోజూ ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇదివరలో రాజధాని మీద రోజుకో ప్రకటన చేసి ప్రజల్లో అయోమయం సృష్టించాడు. అసలు రాజధాని ఎక్కడ కట్టాలనే దానిపై ఓ కమిటీ కూడా వేశారు. సీఎం జగన్‌కు మొదటినుంచి రాజధాని మీద పెద్ద ఇంట్రస్టు లేదు. పోనీ చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలు బయటపెట్టాడా అంటే అదీ లేదు. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ‘రాజధాని నిర్మాణం మాకు ప్రాధాన్యం కాదు’ అని పాత పాట మళ్లీ పాడాడు.

‘లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నగరం నిర్మించే స్తోమత మాకు లేదు’ అని చెప్పేశాడు. ‘లండన్‌ మాదిరిగా రాజధాని నగరం నిర్మిస్తామని పాత ప్రభుత్వం చెబితే దానికి మేం కట్టుబడి ఉండాలా?’ అని కూడా ప్రశ్నించాడు. సరే…లండన్‌లాగానో, న్యూయార్క్‌ మాదిరిగానో నిర్మించక్కర్లేదు. చంద్రబాబు నాయుడు కలలు జగన్‌ నెరవేర్చక్కర్లేదు. కాని అసలు రాజధాని అంటూ ఒకటి ఉండాలి కదా. నవరత్నాల పేరుతో జనాలకు ఉచితంగా డబ్బులు పంచితే సరిపోతుందా? డబ్బులు అందుతున్నందుకు జనం సంతోషిస్తారేమోగాని రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కొత్త రాజధాని నిర్మించడం సాధ్యం కాకపోతే ఉన్నవాటిలో బెటర్‌గా ఉండే నగరాన్ని రాజధానిగా ప్రకటించి డెవెలప్‌ చేయవచ్చేమో ఆలోచించవచ్చు కదా. రాజధాని అంత ముఖ్యం కాదనడం సమంజసమా?

కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన మ్యాప్‌లో ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చూపించింది. తెలుగు ప్రజలకు ఇది అవమానం కాదా అని ప్రశ్నించారు కొందరు. అమరావతి రాజధానిగా ఇప్పటికే విదేశాల్లోనూ ప్రచారమైంది. ఇలా ప్రచారమైనా అమరావతి అధికారికంగా రాజధాని కాదు కాబట్టి కేంద్రం దాన్ని గుర్తించకపోయి ఉండొచ్చు. మ్యాప్‌లో అమరావతి రాజధానిగా లేకపోవడంతో టీడీపీ నాయకులు తెగ బాధపడిపోయారు. ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వానికి చెబితే అమరాతిని రాజధానిగా పేర్కొంటూ మ్యాప్‌లో చేరుస్తామని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చాడట…! చేర్చారనే అనుకుందాం. మ్యాప్‌లో ఉంటే సరిపోతుందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close