వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ధ్యేయ‌గా వ‌ర్మ ఈ సినిమా రూపొందిస్తున్నాడ‌న్న‌ది సుస్ప‌ష్టం. పోస్ట‌ర్లు, టైటిలూ.. వాటితో వ‌ర్మ చేస్తున్న హ‌డావుడి.. చూసిన వాళ్ల‌కెవ‌రికైనా ఈ విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. కానీ.. వ‌ర్మ మాత్రం `ఇది ప‌వ‌న్ క‌థ ఎంత‌మాత్రం కాదు` అనే స్తున్నాడు.

అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం వ‌ర్మ‌ని వ‌ద‌ల‌డం లేదు. సోష‌ల్ మీడియాలో.. దీనిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఈ సినిమాపై గానీ, పోస్ట‌ర్ల‌పై గానీ, వాటి చుట్టూ జ‌రుగుతున్న త‌తంగం గురించి గానీ నోరు మెద‌ప‌డం లేదు. కొంత‌మంది ప‌వ‌న్ స‌న్నిహితులు వ‌ర్మ సినిమా గురించి ప‌వ‌న్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. కానీ ప‌వ‌న్ మాత్రం ఏమాత్రం స్పందించ లేద‌ట‌. ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి చూస్తుంటే, వ‌ర్మ‌ని లైట్ తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ గురించి ఎవ‌రైనా ఏమైనా అంటే విరుచుకుప‌డిపోయే నాగ‌బాబు సైతం… ఈ సినిమా విష‌యంలో ఏమాత్రం నోరు మెద‌ప‌డం లేదు. బ‌హుశా.. అది ప‌వ‌న్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ కావొచ్చు.

వ‌ర్మ మాత్రం ఈసినిమాపై ప‌వ‌న్ స్పందిస్తే బాగుంటుంది అని కాచుకుని కూర్చున్నాడు. కార‌ణం…. తెలిసిన‌దే. వవ‌న్ ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడితే, దీనికి మ‌రింత మైలేజీ వ‌స్తుంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రింత రెచ్చిపోయి – ఈ సినిమాకి ఫ్రీ ప‌బ్లిసిటీ చేసి పెడ‌తారు. వ‌ర్మ దాని గురించే ఎదురు చూస్తున్నాడిప్పుడు. కానీ.. ప‌వ‌న్ మాత్రం వ‌ర్మ‌కి ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండా సైలెంగా ఉండిపోయాడు. విడుద‌ల వ‌ర‌కూ ఇలానే ఓపిక ప‌డితే – ఆ త‌ర‌వాత సినిమాలో ఎలాంటి విష‌య‌మూ లేద‌ని తేలిపోతుంది. ఆ త‌ర‌వాత జ‌నం కూడా మ‌ర్చిపోతారు. ప‌వ‌న్ ఆలోచ‌న ఇదే అయ్యుంటుంది. మ‌రి ఈ నిగ్ర‌హం.. చివ‌రి వ‌ర‌కూ ఉంటుందా? లేదంటే ప‌వ‌న్ మ‌ధ్య‌లోనే బ్లాస్ట్ అవుతాడా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు – తెలంగాణ సర్కార్ తంటాలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా...

విజయసాయిరెడ్డి అసలు క్యారెక్టర్ మళ్లీ బయటకు !

లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు...

జగన్ జైలుకుపోతే షర్మిలే సీఎం !

తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. ఓట్లు రాని ఇంత కష్టం ఎందుకని.. కాస్త కష్టపడితే పదవి వచ్చే మార్గాన్ని బీఆర్ఎస్ నేతలు విశ్లేషించి...

జగన్‌కు “అప్పు రత్న” బిరుదిచ్చిన పవన్ !

సీఎం జగన్ చేస్తున్న అప్పులపై జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close