కేసీఆర్ ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తున్నారా?

సంక్షేమ రంగంలో తెలంగాణ ప్ర‌భుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. తాజాగా ఒంట‌రి మ‌హిళ‌ల‌కు జీవ‌న‌భృతి ప‌థ‌కాన్ని కేసీఆర్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. వాళ్ల‌కు ప్ర‌తినెలా 1000 రూపాయ‌ల పెన్ష‌న్ ఇస్తాన‌ని మాటిచ్చారు. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. మ‌రి త‌న మంత్రివ‌ర్గంలో చేర‌డానికి ఒక్క మ‌హిళా ఎమ్మెల్యేకు కూడా అర్హ‌త లేదా అనే ప్ర‌శ్న‌కు మాత్రం జ‌వాబు లేదు.

కేసీఆర్ కు ప‌లువురు మ‌హిళ‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ఇత‌ర సంస్థ‌ల మ‌హిళ‌ల‌ను ముఖ్య‌మంత్రిని క‌లిసి వేనోళ్ల పొగిడారు.అయితే అక్క‌డ ఒక సీన్ మిస్స‌యింది. ఇంత కీల‌క‌మైన నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌ర్వాత ముఖ్య‌మంత్రికి మ‌హిళ‌లు ధ‌న్యావాదాలు తెలిపే స‌మ‌యంలో మ‌హిళా మంత్రి ఎవ‌రూ లేరు,

తెలంగాణ‌లో మ‌హిళ‌ల సంక్షేమ బాధ్య‌త‌లు చూసే మంత్రి పేరు తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు. క‌నీసం మ‌హిళా సంక్షేమ శాఖ‌ను చూడ‌టానికైనా ఒక మ‌హిళ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శించాయి. జ‌నాభాలో స‌గ‌భాగం ఉన్న మ‌హిళ‌ల త‌ర‌ఫున కేబినెట్ లో క‌నీస ప్రాతినిధ్యం ఇవ్వ‌కపోవ‌డం వివ‌క్ష కాక మ‌రేమిట‌నే విమ‌ర్శ‌లు మొద‌టినుంచీ ఉన్నాయి.

తెరాస‌కు అసెంబ్లీలో మ‌హిళా స‌భ్యులు లేరా అంటే ఉన్నారు. వాళ్ల‌లో ఒక‌రికి డిప్యుటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. అదొక్క‌టే ఘ‌న‌కార్యంగా తెరాస నేత‌లు చెప్పుకుటారు. మ‌హిళ‌ల సంక్షేమానికి పెద్ద పీట వేసే వారు మంత్రిప‌ద‌వి విష‌యంలో మాత్రం చిన్న‌చూపు చూడ‌టం ఏమిటి? ఇప్ప‌టికైనా కేసీఆర్ కొత్త సంవ‌త్స‌రంలో ఆ లోటు భ‌ర్తీ చేస్తారేమో చూద్దామంటున్నారు మ‌హిళా సంఘాల నాయ‌కురాళ్లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశాఖలో విపక్షాలు ఊహించని రేంజ్‌లో విజయసాయి రాజకీయం..!

విశాఖలో వైసీపీని గెలిపించే బాధ్యతను భుజానకు ఎత్తుకున్న విజయసాయిరెడ్డి అక్కడ చేస్తున్న రాజకీయం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ప్రజలు ఓట్లు వేస్తే వైసీపీ అభ్యర్థులు గెలుస్తారో లేదోనన్న సందేహం గట్టిగా ఉందేమో...

అఫీషియ‌ల్‌: సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ముందు నుంచీ...

హైదరాబాద్‌లో ఐపీఎల్ కోసం కేటీఆర్ బ్యాటింగ్..!

సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు లేరని... ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లు ఎవరూ లేరని అందరూ విమర్శలు చేస్తూంటే... మంత్రి కేటీఆర్ మాత్రం.....

హిందీ ‘ఛ‌త్ర‌ప‌తి’.. హీరోయిన్ ఫిక్స్‌

రాజ‌మౌళి - ప్ర‌భాస్‌ల ఛ‌త్ర‌ప‌తిని ఇన్నేళ్ల త‌ర‌వాత బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరో. ఈ సినిమాతోనే హిందీలో అడుగుపెడుతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. త‌న‌కీ ఇదే...

HOT NEWS

[X] Close
[X] Close