మీడియా వాచ్‌: అప‌వాదు చెరిపేసుకున్న కేసీఆర్‌

క‌రోనా ప్ర‌భావం మీడియాపై గట్టిగానే ఉంది. దిన ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ళ్ల సంస్థ‌లు సిబ్బందిని త‌గ్గించే ప‌నిలో ప‌డ్డాయి. జీతాల‌లో కోత విధించాయి. కొన్ని దిన ప‌త్రిక‌లు, వార ప‌త్రిక‌లు మూసేసే ప‌రిస్థితికి వెళ్లాయి. ముఖ్యంగా జీతాల కోత ఉద్యోగస్థుల్ని ఇబ్బంది పెడుతోంది. `సంస్థ‌లు ఉద్యోగుల ప‌ట్ల కారుణ్యం చూపించాలి. ఉద్యోగ‌స్థుల్ని తొల‌గించొద్దు. వాళ్ల జీతాల్లోనూ కోత విధించొద్దు` అని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా చెప్పారు. జీతాల్లో కోత విధిస్తే.. త‌న‌కు చెప్ప‌మ‌ని జ‌ర్న‌లిస్టు సంఘాల్ని కోరారు. అయితే కేసీఆర్ సొంత ప‌త్రిక లాంటి న‌మ‌స్తే తెలంగాణ కూడా ఉద్యోగ‌స్థుల జీతాల‌లో 20 నుంచి 30 శాతం వ‌ర‌కూ కోత విధించారు. సొంత ప‌త్రిక‌లో ఉద్యోగ‌స్థుల జీతాలు క‌ట్ చేసి, బ‌య‌టి ప‌త్రిక‌ల‌కు మాత్రం నీతులు బోధిస్తే ఎలా? అనే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సివ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ త‌న‌పై ప‌డిన ఈ అప‌వాదును చెరిపేసే ప్ర‌య‌త్నం చేశారు. ఎలాగంటే.. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో ప‌నిచేసే ఉద్యోగ‌స్థుల‌కు క‌ట్ చేసిన జీతం ఇప్పుడు మ‌రోసారి ఎకౌంట్‌లో జ‌మ చేశారు. ఈ విధంగా ఉద్యోగ‌స్థులు పూర్తి జీతం పొందిన‌ట్టైంది. మ‌రి మిగిలిన సంస్థ‌లూ… ఉద్యోగుల ప‌ట్ల ఇలానే పెద్ద మ‌న‌సు చూపిస్తాయేమో చూడాలి. ‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close