నా సినిమాల‌కు సీక్వెల్స్ రావు: మారుతి

సీక్వెల్ అంటే అంద‌రికీ మ‌క్కువే. ఓ విజ‌య‌వంత‌మైన క‌థ‌ని, ఫార్ములానీ, టైటిల్‌నీ, ఆ కాంబినేష‌న్ నీ మ‌ళ్లీ వాడుకునే వెసులుబాటు సీక్వెల్ తో వ‌స్తుంది. కాక‌పోతే.. తెలుగు నాట సీక్వెల్స్ అంత‌గా ఆడ‌లేదు. అదో బ్యాడ్ సెంటిమెంట్. మారుతి తీసిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సీక్వెల్ పైచాలా కాలంగా వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమాకి కొన‌సాగింపు వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఇది సీక్వెల్ కి అనువైన క‌థ కూడా. అయితే… మారుతి మాత్రం సీక్వెల్ కి `నో` అంటున్నాడు.

త‌న సినిమాల్లో త‌న‌కు బాగా న‌చ్చిన సినిమా `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` అని, ఈ సినిమా గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్న‌ప్పుడు, ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటున్న‌ప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంద‌ని, అప్పుడే సీక్వెల్ తీయాల‌న్న ఉత్సాహం ఏర్ప‌డుతుంద‌ని, అయితే.. ఆ కోరిక కొద్దిసేపే ఉంటుందంటున్నాడు మారుతి. ”సీక్వెల్ చేయాల‌న్న ఉత్సాహం ఉంది. కానీ చేయ‌ను. ఏదైనా స‌రే కొత్త‌గా చెప్పాలి. కొత్త క‌థ చెప్పాలి. నా ద‌గ్గ‌ర కొత్త క‌థ‌లు చాలా ఉన్నాయి. అందుకే సీక్వెల్స్ జోలికి వెళ్ల‌ను” అని క్లారిటీ ఇచ్చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

‘ప్రాజెక్ట్ కె’… రెండు భాగాలా?

ఈమ‌ధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబ‌లి నుంచీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స‌లార్ రెండు భాగాలే. పుష్ప‌, కేజీఎఫ్‌లూ బాహుబ‌లిని అనుస‌రించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close