సరిహద్దుల అవతల ఉన్న ఉగ్ర క్యాంపుల్ని భారత్ టార్గెట్ చేసుకుంది. ఇలా చేసుకుంటున్నామని భారత్ ముందుగానే అంతర్జాతీయ సమాజానికి సమాచారం ఇచ్చింది. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ ను తప్పు పట్టడానికి ఒక్కటంటే ఒక్క దేశం కూడా ముందుకు రావడం లేదు. అలా చేస్తే ఉగ్రవాదులకు మద్దతిచ్చినట్లేనని వారికి స్పష్టత పచ్చింది. అలా దౌత్య విజయం సాధించింది భారత్.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జైష్ ఏ మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. క్యాంపులు పెట్టి మరీ ట్రైనింగ్ ఇస్తూంటారు. అది జగద్వితం. వీరిని భారత్ పై ఎగదోస్తూంటారు. ఈ సంస్థల్ని అమెరికా కూడా టెర్రరిస్టు గ్రూపులుగా ప్రకటించింది. అలాంటప్పుడు వాటిపై దాడులు చేయడాన్ని అమెరికా వ్యతిరేకించే అవకాశం లేదు. ఇతర అగ్రదేశాలు కూడా అంతే. పాకిస్తాన్ ను సమర్థించడానికి వెనుకాడుతున్నాయి.
భారత్ తమపై దాడి చేసిందని చెప్పుకుంటూ పాకిస్తాన్ అమెరికా, ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాల వద్దకు వెళ్లింది. కానీ ఎవరూ పాకిస్తాన్ మాట వినలేదు. ఉగ్రక్యాంపులపై భారత్ దాడిని పట్టించుకోనట్లుగా ఉండాలని.. అమెరికా సలహా ఇచ్చింది. ఊరుకున్నంత ఉత్తమం ఉండదని అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ కు సలహా ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిలో కూడా.. ఉగ్రక్యాంపులకు మద్దతు ఇచ్చి వాటిపై దాడిచేస్తే గగ్గోలు పెట్టడం మంచిది కాదని పాక్ కు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ కు ఈ దాడుల విషయంలో ఎలాంటి సపోర్టులేదు. పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేసినా.. ఆ దేశానికి సపోర్టు లేకపోవడం భారత్ సాధించిన అతి పెద్ద దౌత్య విజయం అనుకోవచ్చు.