పాపం భాజపా! పుదుచ్చేరిలో కూడా ఒంటరి పోరాటమే

భాజపాకి దక్షిణాదిన మళ్ళీ మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలలో భాజపాతో జత కట్టేందుకు అధికార ఏ.ఐ.ఎన్‌.ఆర్‌.సీ.పార్టీ నిరాకరించింది. తమిళనాడులో జయలలిత (అన్నాడిఎంకె పార్టీ), విజయ్ కాంత్ (డిఎంకె పార్టీ) “మీ పొత్తులు మాకవసరం లేదని” మొహం మీదనే చెప్పేసారు కానీ ఏ.ఐ.ఎన్‌.ఆర్‌.సీ.పార్టీ అధినేత, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కూడా అదే ముక్కని కాస్త పద్ధతిగా తెలియజేసారు. భాజపా పొత్తుల ప్రతిపాదనకు ఆయన సమాధానం చెప్పకుండా ఊరుకొన్నారు. 2014 లోక్ సభ ఎన్నికలలో రంగస్వామి తమ పార్టీతో పొత్తులు పెట్టుకొని విజయం సాధించారు కనుక మే 16న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమతో కలిసి వస్తారనుకొంది భాజపా. కానీ ఈసారి ఆయన కూడా హ్యాండ్ ఇవ్వడంతో భాజపాకి పుదుచ్చేరిలో కూడా ఎదురీత తప్పడం లేదు.

ఇంక గత్యంతరం లేని పరిస్థితులలో పుదుచ్చేరిలో కూడా భాజపా ఒంటరి పోరాటానికి సిద్దమయింది. పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 16 స్థానాలకు భాజపా ఇవ్వాళ్ళ తన అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన 14 స్థానాలకు కూడా భాజపా అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మహేష్ గిరి చెప్పారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్, వామ పక్షాల కూటముల మధ్యనే అనేక దశాబ్దాలుగా అధికార మార్పిడి జరుగుతోంది తప్ప వేరే పార్టీకి, కూటమికి అక్కడి ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు. కనుక అక్కడ కూడా భాజపా ఒంటరి పోరాటం చేయవలసివస్తోంది. కేరళలో పెద్దగా గుర్తింపులేని ఒక స్థానిక పార్టీ భాజపాతో పొత్తులు పెట్టుకోవడానికి అంగీకరించడంతో అదే మహా ప్రసాదం అన్నట్లుగా, ఎలాగు గెలవలేని కొన్ని సీట్లలో కొన్నిటిని దానికీ పంచి ఇచ్చి ఎన్నికలకి సిద్దపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో భాజపాకి తిరుగులేకపోయినా, దక్షిణాదిన మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. వాటితో పోలిస్తే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో భాజపా పరిస్థితి కొంత నయమనుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close