హైవే అధారిటీకి మొట్టికాయ

ప్రభుత్వం పట్ల గౌరవాన్ని భయాన్నీ నటిస్తూ ప్రజలు లేదా వినియోగదారులకు జవాబుదారీ తనం లేకుండా పోతున్న స్వతంత్ర సంస్ధ నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. వాహనదారుల నుంచి వసూలు చేసిన 11 కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వానికి జమచేయాలని ఆదేశించారు. ఇది కేవలం  26 కిలోమీటర్ల రోడ్డుకి సంబందించిన తీర్పే అయినప్పటికీ దేశవ్యాప్తంగా వున్న 40 లక్షల కిలోమీటర్ల  హైవే వాహనదారులకు ప్రశ్నించవచ్చన్న హక్కుని గుర్తు చేస్తున్నట్టు వుంది.
వాజ్ పాయ్ ప్రధానిగా వున్నపుడు మొదలైన జాతీయరహదారుల అభివృద్ధి ఇంకా కొనసాగుతూనే వుంది. ఇందుకు తగ్గట్టే వాహనాల సంఖ్య, ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే వున్నాయి. కోటానుకోట్లరూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసిన సంస్ధలు
వాహనదారుల నుంచి టోలు ఫీజు వసూలు చేస్తూ సొమ్ము రాబట్టుకుంటున్నాయి.  హైదరాబాద్ బెంగుళూరు నగరాల మధ్య కారులో ప్రయాణం చేసేవారు ఆరుచోట్ల టోల్ ఫీజుగా దాదాపు ఆరువందల రూపాయలు శుల్కం చెల్లిస్తున్నారు. బస్సులవారు, లారీలవారు ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించవలసి వస్తోంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చే రోడ్డు రవాణా సంస్థ బస్సులపై రానుపోను రెండు వేల రూపాయలకు పైగా చెల్లించవలసి వస్తోంది.
ఈ వసూళ్ళనుంచి రోడ్లను గతుకలు లేకుండా నిర్వహించడం, ప్రతీ వంద కిలో మీటర్లకీ టాయ్ లెట్లు, రెస్ట్ రూములు ఏర్పాటు చేసి నిర్వహించడం, ఏక్సిడెంట్ల సందర్భాల్లో ఆంబులెన్సులు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం, ప్రయాణికుల భద్రత కోసం పెట్రోలింగ్ చేయడం మొదలైనవన్నీ హైవేలను వేసి టోల్ ఫీజులు వసూలు చేస్తున్నవారి బాధ్యతలే. వీటన్నిటినీ పర్యవేక్షించడానికి నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. ఇందులో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, అధికారులు వుంటారు. టోలు వసూళ్ళు తప్ప మిగిలిన బాధ్యతలను నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్న విమర్శ  దేశమంతటా వున్నదే . ముఖ్యంగా టాయ్ లెట్లు రెస్ట్ రూముల ఏర్పాటు ని దాదాపు అందరూ విస్మరించారు. విదేశీ సంస్ధల పెట్టుబడులున్న పెద్దపెద్ద సంస్ధలను అదే అధారిటీలో వున్న అధికారులు ప్రశ్నించలేని వాతావరణం వుంది.
ప్రయివేటు వాహనాలతోపాటు ప్రభుత్వరంగ సంస్ధల వాహనాలూ టోలు చెల్లించవలసిందే. నష్టాల్లో వున్న సంస్ధలు ఇతర ప్రభుత్వ రంగ సంస్ధలకు బకాయిలు పడుతూనే వుంటాయి. వాటి మాట ఎలా వున్నా టోలుగేటు వ్యాపారులకు మాత్రం బాకీ పడకూడదన్న అధారిటీ నిర్ణయంలోనే దేశ, విదేశీ పెట్టుబడులున్న హైవే వ్యాపారుల లాబీయింగ్ లేదా పలుకుబడిని అర్ధంచేసుకోవచ్చు.
చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్, దుర్గ్ నగరాల మధ్య లోతైన గతుకులతో నిండిపోయిన ఇరవై ఆరు కిలోమీటర్ల జాతీయ రహదారి . ఈ రోడ్డు వినియోగదారుల వద్ద కాంట్రాక్టర్లు భారీగా వాహన టోల్  వసూలు చేయడం పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, కురియన్ జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ సంస్థవారు ఈ రోడ్డుపై వసూలు చేసిన పదకొండు కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని కూడ న్యాయమూర్తులు ఆదేశించడం అక్రమ వాణిజ్య పద్ధతులకు అడ్డుకట్ట వంటిది. రోడ్డు గతుకులు పడి ఉన్నందువల్ల నిర్వహణ సంస్థ నిర్ధారించిన టోల్ ఫీజులో అరవైశాతం మాత్రమే వసూలు చేయాలని గత మార్చిలో అధారిటీ నిర్ణయించింది. అలా వసూలు చేసిన డబ్బే పదకొండు కోట్ల రూపాయలు. కానీ రోడ్డు పరిస్థితి మెరుగు పడేవరకు ఎలాంటి శుల్కం వసూలు చేయకూడదని నాలుగురోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేశారు.
టోల్ గేటు లో కంప్లెయింబుక్ వుంటుంది అన్న విషయాన్నే డిస్ ప్లే చేయడంలేదు. రోడ్డు వేసిన డబ్బుని ఇలా వసూలు చేసుకుంటున్నారని మాత్రమే తెలిసిన వాహనదారులకు టొల్ గేటు వారి బాధ్యతల గురించి తెలియదు. ప్రజాప్రయోజనాలు హక్కులను మళ్ళీ మళ్ళీ చాటి చెప్పే ఇలాంటి తీర్పులు మౌలిక సదుపాయాలు కల్పించి వాడకందారుల నుంచి డబ్బు రాబట్టుకునే కంపెనీలన్నిటికీ కనువిప్పు కలిగిస్తాయి. ప్రజలను చైతన్యపరుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close