సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని ..అమరావతిని నదీగర్భంలో కడుతున్నారు అంటూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంగ్లిష్ మీడియాను పిలిచి జగన్ రెడ్డి చేసిన ఈ వితండవాదం అంతటా హాట్ టాపిక్ అయింది కానీ.. జగన్ రెడ్డి మీడియాలో మాత్రం రాలేదు. అసలు పట్టించుకోలేదు. జగన్ రెడ్డి సానుభూతి మీడియా కూడా పెద్దగా ప్రచారం చేయలేదు. ఇందులో ఉన్న కుట్రను ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు ద్వారా బయట పెట్టారు.
జగన్ రెడ్డి అమరాతిని చంపేయడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అమరావతికి ప్రజల మద్దతు ఉంది. అయినా సరే దాన్ని చంపాలనుకుంటున్నారు. అందుకే అమరావతిని రాజధానిగా గుర్తించేలా పార్లమెంట్ లో బిల్లు పెట్టబోతున్నారని తెలిసి.. ఇంగ్లిష్ మీడియాను పిలిచి తన వ్యతిరేకతను చూపించారు. జగన్ వ్యతిరేకతను చూపి బీజేపీ బిల్లును పెట్టకుండా ఆపేస్తుందా.. లేదా అన్నది తర్వాత విషయం కానీ తన వ్యతిరేకతను ఆయన చూపించారు. కానీ ఇలా జగన్ రెడ్డి అమరావతిపై విషం చిమ్మాడని తెలిస్తే ఇక్కడి ప్రజలు వైసీపీని ఛీకొడతారు. ఆ విషయం తెలియకూడదు. అందుకే జగన్ రెడ్డి ప్రెస్మీట్ ను పది ఫోటోలు పెట్టి ఆయన సుభాషితాలను ప్రచురించారు కానీ.. అమరావతి గురించి మాత్రం స్కిప్ చేశారు. సాక్షిలో వేయకపోతే ఎవరికీ తెలియదా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. జగన్ రెడ్డి బలం అదే. తనను నమ్మేవాళ్లను మాయాలోకంలో ఉంచడమే ఆయన బలం.
అమరావతిపై జగన్ రెడ్డి చేసే కుట్రలు ఎలా ఉంటాయో.. సజ్జల, పేర్ని నాని కవరింగ్ ద్వారా బయటపడ్డాయని ఆర్కే విశ్లేషించారు. జగన్ మాటల్ని వక్రీకరించారని జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని వీరు చెప్పడం ప్రజల్ని మోసం చేయడంలో భాగమేనని తేల్చారు. అదే సమయంలో నీళ్ల విషయంలో జరుగుతున్నరాజకీయాన్ని కూడా చాలా సింపుల్ గా వివరించారు. అటు కేసీఆర్, ఇటు జగన్ సొంత మీడియాను పెట్టుకుని.. చంద్రబాబుపై భిన్న వాదనలతో నిందిస్తున్నారు. ఏపీ ద్రోహి అని జగన్ అంటే.. తెలంగాణ ద్రోహి అని కేసీఆర్ మీడియా అంటోంది. నిజంగా ద్రోహం అంటూ చేస్తే ఏదో ఒకటే చేయాలి కదా.. ఎవరికి చేసినట్లు?. ఎవరికీ జరగలేదు..ప్రజల్ని నమ్మించే రాజకీయంలో అది జగన్, కేసీఆర్ ప్రయాస అని ఆర్కే తేల్చారు.
ప్రజలు ఎంతో తెలివైన వాళ్లని గత ఎన్నికల్లో నిరూపితమయిందని.. వారిపై నమ్మకంతో చంద్రబాబు రాజధానిని వేగంగా నిర్మించి ప్రజలు పెద్ద ఎత్తున వలస వచ్చేలా చేయాలని సలహా ఇచ్చారు. ఏం చేసినా జగన్ రెడ్డి పొరపాటునో..గ్రహపాటునో అధికారంలోకి అమరాతిలో కట్టినవన్నీ కల్చివేయడం ఖాయమని ఆర్కే అంచనా. అంతిమంగా అమరావతి అంటే.. అంతులేని ద్వేషంతో ఉన్న జగన్ .. విచక్షణ కోల్పోయారు. ఏం చేస్తారో ఊహించడం కష్టమని ఆర్కే పలుకు సారాంశం.
