వైఎస్ జయంతికి ప్లీనరీ చేస్తారని జగన్ పై ఆశలు పెట్టుకున్న వైసీపీ కార్యకర్తలకు షాక్ తగిలింది. ఈ ఏడాది ఫోటోలకు దండలు మాత్రమే ఉంటాయని వచ్చే ఏడాది ఘనంగా ప్లీనరీ జరుపుకుందామని చెప్పేశారు. టీడీపీ కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తూంటే.. కనీసం పోటీగా పులివెందులలో అయినా ప్లీనరీ నిర్వహించి సత్తాచాటుదామని కార్యకర్తలు అనుకున్నారు. కానీ జగన్ రెడ్డికి ఓపిక లేదు.. అంతకు మించి మూడ్ లేదు. అందుకే సైలెంట్ అయిపోయారు. ఈ ఏడాది ప్లీనరీ ఉండదని ఆయన చెప్పేశారు.
నిజానికి జగన్ రెడ్డికి పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. పార్టీ నిర్మాణం కూడా పట్టదు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్లీనరీని ఒక్కసారే చేసుకున్నారు. అది కూడా ఇక భవిష్యత్ లో అంతర్గత ఎన్నికలు, ప్లీనరీలు .. అవసరం లేకుండా తనను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి ఏర్పాటు చేశారు. అయితే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. అలా కుదరదని చెప్పడంతో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు.
వైఎస్ఆర్సీపీ పేరుతో వైఎస్ఆర్ పేరు ఉందని అందరూ అనుకుంటారు. అలా అనుకునేలా జగన్ రెడ్డి శివకుమార్ అనే వ్యక్తి పెట్టుకున్నపార్టీని లాక్కుున్నాడు. నిజానికి ఆ శివకుమార్ యెదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డికాంగ్రెస్ పార్టీ అని పెట్టలేదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. జగన్ రెడ్డి కూడా అలాగే ఉండాలని తీసుకున్నారు. తండ్రి పేరుతో పార్టీ పెట్టుకున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు తండ్రి జయంతికి నిర్వహించే ప్లీనరీల్ని.. లైట్ తీసుకుంటున్నారు. పార్టీని నడుపుకోవడం అంటే ఎదుటి పార్టీపై కుట్రలు చేస్తే చాలు… ఆ పార్టీపై కోపంతో తనకు ఓట్లు వేస్తారని అనుకున్నట్లుగా జగన్ రెడ్డి రాజకీయం ఉంటుంది. ఇలాంటి నేతను నమ్ముకున్న కార్యకర్తలకు ఏడుపొక్కటే తక్కువన్నట్లుగా సీన్ ఉంది.