బంగ్లాదేశ్ రగిలిపోతోంది. ఒకటి తర్వాత ఒకటి హత్యలు జరుగుతున్నాయి. అదీ కూడా యూనస్ ప్రభుత్వాన్ని దీనికి కారణం ఎవరో తెలియదు కానీ అక్కడి చదువు లేని యువత ఇండియాను నిందిస్తున్నారు. అయితే హత్యలు భారత్ చేయించదని అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఎవరో కుట్రలు చేసి భారత్, బంగ్లాదేశ్ మధ్య అసలు సంబంధాలు లేకుండా చేయడంతో పాటు.. ఎన్నికల్లేకుండా పదవుల్ని .. దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుందామని ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.
హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన హాదీ అనే యువకుడ్ని దుండగులు కాల్చి చంపారు. చంపిన వాళ్లు ఇండియాకు పారిపోయారని పుకార్లు పుట్టించి మరిన్ని ఘర్షణలు జరిగేలా చేశారు. ఈ వ్యవహారం అంతా కుట్ర పూరితంగా సాగుతోందని.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఇలా జరగడం వల్ల.. ఎన్నికలు జరగకుండా ఆపేసి.. పదవుల్లో ఉండిపోదామని యూనస్ చేస్తున్న కుట్రగా ఎక్కువగా మంది అనుమానిస్తున్నారు. ఆయన తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఆయననూ తరిమికొడతామని ఉద్యమకారులు అంటున్నారు.
వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. షేక్ హసీనా పార్టీని ఇప్పటికే బ్యాన్ చేశారు.కానీ అంతర్జాతీయంగా బంగ్లా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాదని నిర్ణయాలు తీసుకుంటే తామూ కఠినంగా ఉండాల్సి వస్తుందన్న సంకేతాలను ఆ దేశానికి పంపిస్తున్నారు. దీంతో యూనస్‌కు ఏమీ పాలుపోవడం లేదు. ఎన్నికలు నిర్వహిస్తే ఆయన పదవి ఉండదు. పదవిలో ఉండాలంటే ఎన్నికలు జరగకూడదన్నది ఆయన ప్లాన్. అందుకే దేశాన్ని మండిస్తూనే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. త్వరలో యూనస్‌కు ఉద్యమకారులు గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. యూనస్ నోబెల్ శాంతిబహుమతి గ్రహీత కావడం.
