హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఐటీ కారిడార్ ఉన్న వెస్ట్ ప్రాంతం గోల్డ్. అక్కడ పెట్టుబడులు పెట్టడం లేదా ఇల్లు కొనడం అనేది.. అందరికీ ఓ డ్రీమ్. మార్కెట్ కూడా అక్కడే కేంద్రీకృతమయింది. హైదరాబాద్ మొత్తం మీద జరిగే రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో యాభై శాతం అక్కడే జరుగుతుంది. ఇప్పుడు మెల్లగా నార్త్ హైదరాబాద్ కూడా వెస్ట్ ను అందుకుంటోంది. కొన్నేళ్లలో వెస్ట్ ప్రాంతాన్ని బీట్ చేసి.. నార్తే అత్యంత విలువైనదిగా మారినా ఆశ్చర్యం ఉండదన్న అభిప్రాయం రియల్ ఎస్టేట్ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో ముఖ్యమైన ప్రాంతాలు సికింద్రాబాద్, మేడ్చల్, గండి మైసమ్మ, మల్కాజిగిరి వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతం మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి , మెట్రో విస్తరణతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం ఐటీ రంగాన్ని నార్త్ వైపు విస్తరించేందుకు ప్రణాళికలుసిద్ధం చేసుకుంది. ఇప్పటికే నార్త్ లో ఫార్మా రంగం పాతుకుపోయింది. వందలాది బయోటెక్ ఫార్మా కంపెనీలు వచ్చే అవకాశం ఉన్న ఉన్న జీనోమ్ వ్యాలీ 2.0 అమల్లోకి వస్తోంది.
కండ్లకోయలో అత్యంత ఎత్తైన ఐటీ టవర్ నిర్మాణం జరుగుతోంది. 100 కంపెనీలకు నిలయంగా, 50,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు, ఇది ఈ ప్రాంతంలో ఐటీ , వాణిజ్య అభివృద్ధికి ఉపయోగపడనుంది. అంతేకాకుండా, ఆరోగ్య సంరక్షణ, గిడ్డంగులు, తయారీ మరియు లాజిస్టిక్స్ కంపెనీలు ఇక్కడ వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నాయి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. నార్త్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో 15-20% వృద్ధి రేట్‌తో ముందుకు సాగుతోంది. నార్త్ సైడ్‌లో మధ్యస్థ తరగతి కుటుంబాలకు అనుకూలమైన ఇళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు 2024-25 మధ్య 25% పెరిగినట్లుగా రికార్డులు చెబుతున్నాయి.