ఏపీ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఈ నవంబర్ అత్యంత కీలకమైనది. ఓ వైపు సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు విశాఖ వేదిక అవుతోంది. మరో వైపు ఆర్సెలార్ మిట్టర్, టీసీఎస్ వంటి పరిశ్రమలకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు ఉండబోతున్నాయి.
ప్రభుత్వం పార్టనర్ షిప్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. విశాఖను ఇప్పటికే ముస్తాబు చేస్తున్నారు. మరో పది రోజుల్లో జరగనున్న సమ్మిట్ కోసం ఏర్పాట్లను నారా లోకేష్ చూసుకుంటున్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్ లో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఉంటాయని ఆయన ప్రకటించారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు ఇప్పటికే సమాచారమిచ్చారని తెలిపారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
నవంబర్ లో ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని ప్రకటించారు. లక్షలన్నర కోట్లతో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టర్ ప్లాంట్ కు ఇదే నెలలో శంకుస్థాపన జరుగుతుంది. టీసీఎస్ ఆఫీస్ ఇదే నెలలో ప్రారంభమవుతుంది. ఇరవై లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో యువతకు కల్పించాలన్న లక్ష్యంతో నారా లోకేష్ పని చేస్తున్నారు. ఆ ప్రయామంలో ఈ నవంబర్‌లో దాదాపుగా పది లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరుగుతాయి.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              