కాకినాడ‌లో పెరుగుతున్న ఎన్నిక‌ల వేడి!

ఒక సాధార‌ణ ఉప ఎన్నిక‌ను రాష్ట్ర స్థాయి ఎన్నిక‌గా చిత్రిస్తూ అధికార‌, ప్ర‌తిప‌క్షాలు పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, నంద్యాల‌ వేడి ఇక‌పై చ‌ల్లారుతుంది. దీంతో ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల దృష్టంతా కాకినాడ‌పైకి మ‌ళ్లింది. అక్క‌డ‌ ప్ర‌ధాన పార్టీల ప్ర‌చారం హోరెత్తుతోంది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్ని కూడా అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలా సీరియ‌స్ గా తీసుకుంటున్నాయి. మామూలుగా అయితే, స్థానిక సంస్థ ఎన్నిక‌లు అంటే… అక్క‌డి స‌మ‌స్య‌ల‌కే ప్రాధాన్య‌త ఉంటుంది. రాజకీయ పార్టీల‌కంటే ముఖ్యంగా స్థానిక స‌మీక‌ర‌ణ‌లపైనే ప్ర‌జా తీర్పు ఉంటుంది. కానీ, ఈ ఎన్నిక‌లో కూడా స్థానిక అంశాల కంటే, రాష్ట్ర స్థాయిలో పాల‌నాంశాల‌నే ప్ర‌చారాస్త్రాలుగా తెర‌మీదికి తీసుకురావ‌డం విశేషం! కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా అభివృద్ధి నినాదాన్ని తెలుగుదేశం వినిపిస్తుంటే… చంద్ర‌బాబు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంపైనే వైకాపా ఆధార‌ప‌డింది.

ఈ నెల 29న కాకినాడ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ప్ర‌చార ప‌ర్వానికి మ‌రో ఐదు రోజులు గ‌డువు ఉంది. దీంతో, ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల నాయ‌కులు కాకినాడ‌లో సంద‌డి చేస్తున్నారు. ఈ ఎన్నిక‌లో టీడీపీ, వైసీపీ, భాజ‌పా, కాంగ్రెస్‌, బీఎస్పీల‌తోపాటు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా బ‌రిలో ఉన్నారు. ఎవ‌రి స్థాయిలో వారు ఓట్ల వేట‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ‌లో కూడా అభివృద్ధి నినాద‌మే వినిపిస్తోంది. కాకినాడ‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయ‌డం ద్వారా గ‌తంలో ఎన్న‌డూ లేనంత అభివృద్ధి త‌మ హ‌యాంలోనే జ‌రిగింద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇక్క‌డ కూడా మంత్రులు రంగంలోకి దిగి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఈ ఎన్నిక‌ విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కాకినాడలో కూడా కుల స‌మీక‌ర‌ణ‌లే తెర‌మీద క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా కాపుల‌ను ఆక‌ర్షించ‌డంపై అధికార ప్ర‌తిప‌క్షాలు దృష్టిపెట్టాయ‌న‌డంలో సందేహం లేదు.

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక ముంచుకొస్తున్న సంద‌ర్భంలోనే కాపు నేత‌ల‌తో ఇటీవ‌ల ముఖ్యమంత్రి భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. కాపుల రిజ‌ర్వేష‌న్ల‌తోపాటు అన్ని స‌మ‌స్య‌లూ తీర్చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డం వెన‌క కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నికలో తాత్కాలిక ల‌బ్ధి ఆశించ‌డ‌మే వ్యూహ‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. ఇక‌, వైకాపా విష‌యానికి వ‌స్తే.. నంద్యాల ప్ర‌చార వ్యూహాన్నే ఇక్క‌డా అనుస‌రించ‌డం విశేషం! తెలుగుదేశం పార్టీపై విమ‌ర్శ‌ల‌నే త‌మ ప్ర‌చారాస్త్రాలుగా వాడుకుంటోంది. తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చాక అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌నీ, చంద్ర‌బాబు నాయుడు మూడేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగు చెందార‌నీ, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వ‌స్తుంద‌న్న ధీమా వ్య‌క్తం చేస్తూ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్ని కూడా ప్ర‌ధాన పార్టీలు ఇంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మార్చేస్తున్నాయి. మంత్రులూ రాష్ట్ర నేత‌లూ ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తున్నారు. భ‌విష్య‌త్తు పంచాయ‌తీ స‌ర్పంచ్ ఎన్నిక‌లకు కూడా మంత్రులు, బ‌డా నాయ‌కులు ప్ర‌చారానికి వ‌చ్చేస్తారేమో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ని కలిసి జగన్‌పై విమర్శలు చేసిన బండి సంజయ్..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారని.. తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమవేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో కలిసి...

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

HOT NEWS

[X] Close
[X] Close