ఇక తెలుగులో పచ్చ, నీలి మీడియాలు మాత్రమే..!

భస్మాసుడు త0న నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్లుగా తెలుగు మీడియా పెద్దలు రాజకీయ స్వార్థాలు… ఆర్థిక ప్రయోజనాలకు కక్కుర్తి పడి.. మీడియా నెత్తి మీద చేయి పెట్టేస్తున్నారు. ఇప్పుడు తెలుగు మీడియానూ తెలుగు ప్రజలు విశ్వసించడం లేదు. నిజమైన వార్తను ఓ మీడియా ప్రసారం చేసినా.. ఆ మీడియా ఏ వర్గానిదో చూసి… ఫేక్ అని ప్రచారం చేయడం ప్రారంభిస్తున్నారు. దీంతో తెలుగు మీడియా విశ్వాసనీయత పాతాళంలోకి పడిపోతోంది. ఇప్పటి వరకూ… తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను పచ్చ మీడియాగా అభివర్ణిస్తూ వైసీపీ నేతలు విమర్శించేవారు. ఇంత కాలం సహించిన టీడీపీ నేతలు.. ఇతర మీడియా వైసీపీకి అడ్డగోలుగా మద్దతు పలుకుతూ వస్తూండటంతో సహనం కోల్పోయింది. ఇక నుంచి నీలి మీడియాగా పిలవాలని నిర్ణయించుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు నీలి రంగు. అందుకే.. ఇక నీలి మీడియా అంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ఈ నీలి మీడియాలో ఇప్పుడు ఎక్కువ చానళ్లు… పత్రికలు ఉన్నాయి. మ్యానిపులేటెడ్ న్యూస్ ఆ నీలి మీడియాలో ఎక్కువగా వస్తుంది. ప్రతిపక్షపార్టీలపై తప్పుడు ప్రచారం చేయడానికి ట్రేడ్ మార్క్‌ను ఇప్పటికే ఆయా మీడియా సాధించింది. అదే వైసీపీకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే.. అండర్ ప్లే చేయడంలో కూడా రాటుదేలిపోయింది. అయితే సోషల్ మీడియా యుగంలో ఈ తేడా చాలా సులువుగా అందరికీ తెలిసిపోతుంది. కానీ అందరూ పార్టీల ప్రకారం విడిపోయారని.. ఎవర్ని ఏది ఎక్కువగా నమ్మించగలిగితే అనే నిజం అని మీడియా పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బరితెగించేస్తున్నారు.

మీడియాపై రాజకీయ ఒత్తిడులు ఉంటే పతనమే. తమ రాజకీయ బాసులకు.. తమ ఓనర్లకు దగ్గరైన రాజీకయ నేతలకు ఇష్టం లేదని..ప్రజలకు ఆసక్తి ఉన్న వార్తలను ప్రసారం చేయకుండా పక్కన పడెస్తే … ప్రజలు ప్రత్యామ్నాయాలను చూసుకుంటారు. ఈ రోజు అదే జరుగుతోంది. ఒక్క సారి విశ్వసనీయత కోల్పోతే.. అంత త్వరగా మళ్లీ రాదు. రాజకీయ ఉచ్చులో చిక్కకున్న మీడియా మెల్లగా … ప్రభావాన్ని కోల్పోతుందని అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close