రూపాయి పతనం ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఎన్నారైలు డాలర్లు తేవాలట..!!

రూపాయి పతనం.. శరవేగంగా సాగుతోంది. ఇప్పటి నుంచి కాదు.. చాలా రోజుల నుంచి పతనం ఉంది. అయితే.. ఈ పతనం.. నిన్నమొన్నటిదాకా.. రోజుకు 2 లేదా 3 పైసల స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఏకంగా రోజుకు రూపాయి తేడా కనిపించే స్థాయికి వచ్చింది. రూపాయి పతనాన్ని ఊహించినప్పుడే… గుర్తించి… కేంద్రం తరపున కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం..” పై వాడిదే భారం” అంటే.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఫలితంగా.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే రీతిలో.. రూపాయి పతనం సాగుతోంది. దీంతో ఇప్పుడు రూపాయి పతనాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అది ఎన్నారైలను బతిమాలుకోవడం.

రూపాయిని నిలబెట్టడానికి ప్రవాసుల సాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల నుండి పెద్దయెత్తన డాలర్లను సేకరించడం ద్వారా.. రూపాయికి విలువ పెంచాలని ఆలోచిస్తోంది. అందుకోసం ప్రత్యేక పథకాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 2013లో రూపాయి పతనం శరవేగంగా ఉన్నప్పుడు.. అప్పటి ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌ రాజన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డాలర్లలో చెల్లించాల్సిన దిగుమతుల్ని.. తగ్గించగలిగారు. బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. ఎన్నారైల దగ్గర్నుంచి డాలర్ల సేకరణ కోసం పెట్టుబడి పథకం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మిగతా వాటిని పెద్దగా పట్టించుకోని కేంద్రం.. వారి వద్ద ఉన్న డాలర్లను మాత్రం… స్వేదేశానికి తీసుకు రమ్మని అడుగుతోంది.

అంతకంతకు క్షీణిస్తున్న రూపాయి విలువతో..బంగారం పండుగ చేసుకుంటోంది. రూపాయి విలువ పడిపోతుండటంతో, బులియన్‌ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. బంగారానికి గ్లోబల్‌గా డిమాండ్‌ లేనప్పటికీ, దేశీయంగా మాత్రం రివర్స్‌ ట్రెండ్‌ నమోదైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.మరోవైపు ముడిచమురు ధరలు తగ్గే సూచనలు కూడా సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు.మరోవైపు పెరిగిపోతున్న ధరలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అంతకు మించి చేయడానికి తమ వద్ద సరుకు లేదని అంగీకరిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close