చంద్రబాబు భద్రతపై మరోసారి ఎన్‌ఎస్‌జీ రివ్యూ !

చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో ఏపీ పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఎన్ఎస్‌జీ చీఫ్ కు మరోసారి నివేదిక వెళ్లినట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి సభలో స్టేజ్ పైకి వందల మందిని ఒకే సారి వెళ్లేలా పోలీసులు వదిలారు. దాంతో వారంతా దూసుకొచ్చారు. చంద్రబాబు తోపులాటలో కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. తమ భద్రతలో ఉన్న చంద్రబాబు విషయంలో పోలీసులు అత్యంత కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికే ఎన్‌ఎస్జీ ఓ అంచనాకు వచ్చింది. చంద్రబాబుకు సెక్యూరిటీని రెట్టింపు చేసింది.

ఎన్నికల సమయంలో మరింతగా చంద్రబాబుకు ముప్పు ఉందని .. పోలీసులు నిర్లక్ష్యం బట్టబయటలు కావడంతో NSG కమాండో చీఫ్ సెక్యూరిటీ రివ్యూ కోసం హైదరాబాద్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి కాతేరు లో టిడిపి సభలో ఒక్కసారిగా దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపైఎన్ఎస్‌జీ ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిందని.. కేంద్రానికి నివేదిక ఇస్తారని .. అంటున్నారు. ఎన్నికల వరకూ చంద్రబాబుకు ప్రత్యేకమైన భద్రత పెంటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు ప్రాణానికి ముప్పు తలపెట్టేలా జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఐదేళ్లలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అనేక సార్లు రాళ్ల దాడులు చేశారు. ఆ రాళ్ల దాడుల్లో ఎంతో మందికి గాయాలయ్యాయి. మార్కాపురంలో ఓ వృద్ధుడు చనిపోయాడు కూడా.ఇదంతా వైసీపీ నేతలు.. పోలీసుల అండతోనే చేశారు. దీనిపై స్పష్టమైన నివేదికలు కేంద్రానికి చేరినట్లుగా తెలుస్తోంది. త్వరలో భద్రత పెంపును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close