క‌ల్యాణ్‌కి ఎన్టీఆర్ స‌ర్దుబాటు

ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీశాడు క‌ల్యాణ్ రామ్‌. అదే… ‘జై ల‌వ‌కుశ‌’. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంది. క‌ల్యాణ్ రామ్‌కి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాల‌ని, ఈసారి వ‌చ్చిన లాభాల్లో త‌మ్ముడికి 50 శాతం వాటా ఇవ్వాల‌ని క‌ల్యాణ్ రామ్ భావించాడు. అందుకోసం క‌థ‌ల్ని కూడా వెదికే ప‌నిలో ప‌డ్డాడు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చే సినిమాకి క‌ల్యాణ్ రామ్ భాగ‌స్వామిగా చేరిపోయాడు. సోలోగా సినిమా తీయ‌డం కంటే, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాకి భాగ‌స్వామిగా ఉండ‌డం క‌ల్యాణ్ రామ్‌కి బెట‌ర్ ఆప్ష‌నే. పైగా.. ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. బ‌డా ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌తో సినిమాలు చేయ‌డానికి క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. ఈద‌శ‌లో క‌ల్యాణ్ రామ్ బ్యాన‌ర్‌కీ ఓ స్లాట్ చూడ‌డం క‌ష్ట‌మైపోతోంది. అందుకే ఇలా ‘పార్ట‌న‌ర్‌షిప్‌’ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్‌. పైగా తాజా చిత్రంలో ఎన్టీఆర్‌కి సైతం వాటా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పారితోషికం బ‌దులుగా లాభాల్లో వాటా తీసుకోవ‌డానికి ఎన్టీఆర్ మొగ్గు చూపిస్తున్నాడ‌ట‌. అంటే.. ఓర‌కంగా ఎన్టీఆర్ కూడా నిర్మాతే. అందుకే అన్న‌య్య బ్యాన‌ర్‌ని రంగంలోకి దించాడు. ఇక మీద‌ట ఎన్టీఆర్ సినిమాల్లో ‘ఎన్టీఆర్ ఆర్ట్స్‌’ వాటా పొందితే… అంత‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com