జూనియర్ ఎన్టీఆర్ లుక్ ను పూర్తిగా మార్చేసిన క్రెడిట్ రాజమౌళికి దక్కుతుంది. ఎన్టీఆర్ ను పూర్తిగా చెక్కెశాడు జక్కన్న. అప్పటివరకూ బొద్దుగా వున్న ఎన్టీఆర్ ను చువ్వలా చూపించాడు. యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ లో ఈ మార్పును తీసుకోచ్చాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత సరికొత్త ఎన్టీఆర్ కనిపించాడు. లావు తగ్గిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అని ఎన్టీఆర్ ని ఓసారి అడిగితే..” దానితో శని పొయిందండి”అని సమాధానం ఇచ్చాడు. అంటే అర్ధం చేసుకోవచ్చు. సన్నబడటం తారక్ కు ఎంతలా కలిసొచ్చిందో.
యమదొంగ తర్వాత స్లిమ్ తారక్ ను చూసి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషి అయిపోయారు. దిని తర్వాత ఇదే లుక్ ను కొనసాగించి తెరపై మెరుపుతీగలా కదిలాడు తారక్. ఆ మద్యన వచ్చిన టెంపర్ లో మరింత ట్రాన్స్ఫర్మేషన్ చూపాడు. కంప్లీట్ లీన్ గా మారిన జూనియర్.. ఏకంగా సిక్స్ ప్యాక్ తో కేక పుట్టించాడు. తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో సరికొత్త లుక్ లో అలరించాడు. అయితే జనతాగ్యారేజ్ విషయానికి వస్తే.. మళ్ళీ కాస్త హెవీ లుక్ కనిపించింది. వర్క్ అవుట్ తగ్గించినట్లు అనిపించింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ లుక్ ను చూస్తే వర్క్ అవుట్స్ పూర్తిగా వదిలేసినట్లు అనిపించింది.
అయితే ఇప్పుడు మళ్ళీ స్లిమ్ మంత్రాలోకి వెళ్ళిపోతున్నాడు జూనియర్. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు ఎన్టీఆర్. కధ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించాలట. ఇందుకోసం జిమ్లో కసరత్తులు మొదలెట్టేశాడట తారక్. ఇందులో మళ్ళీ సరికొత్త తారక్ ను చూస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.