జర్మనీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

తెలుగు సినీరంగంలో ధ్రువతారగా వెలుగొంది, రాజకీయంలో తిరుగులేని నాయకుడుగా, అశేష ప్రజల మనస్సుల్లో ఆరాధ్యదైవంగా నిలిచిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ డా. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరం నందు మే 20 తారీఖున ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగబోతున్నాయి.

తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం 2018 నుంచి ప్రతి సంవత్సరం తారకరాముని జన్మదిన వేడుకలను జర్మనీ లో నివసిస్తున్న తెలుగువారితో మినీ మహానాడు గా ఘనంగా జరుపుకుంటారు.

ఈసారి కూడా శతజయంతి ని మునిపెన్నడూ లేని విధంగా జరపాలి అని తెలుగుదేశం జర్మనీ విభాగపు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు.

రాబోయే సంవత్సరంలో ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీకి తమవంతు సహాయంగా ఎలా ఉపయోగపడాలో తీర్మానాల ద్వారా చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయి తమ సందేశాలను పంచుకుంటారు అని కమిటీ సభ్యులు తెలిపారు.

జర్మనీలో నివసిస్తున్న ప్రతి తెలుగువాడు మినీ మహానాడుకి హాజరయి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించవలసినదిగా కోరారు.

Content Produced by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close