ఎన్టీఆర్‌తో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ స్పెష‌ల్‌

ఈనెల 5న ఎల్‌బీ స్టేడియంలో స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. ఈ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. చిరు రాక‌తో ఈ ఈవెంట్‌కి కొత్త క‌ళ రాబోతోంది. అయితే ఇప్పుడు `స‌రిలేరు… `టీమ్ మ‌రో ఈవెంట్‌ని ఈప్లాన్ చేస్తోంది. అది ఎన్టీఆర్‌తో.

అవును.. మ‌హేష్ బాబు ‘మ‌హ‌ర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్ అతిథిగా వచ్చాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని మ‌హేష్ మ‌రోసారి కొన‌సాగించ‌బోతున్నాడు. జ‌న‌వ‌రి 9న హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం మ‌రో ఈవెంట్‌కి ప్లాన్ చేసింది. ఈసారి ఎన్టీఆర్‌ని గెస్ట్‌గా పిలిచింది. ఎన్టీఆర్ టైమ్ ఫిక్స్ చేయ‌గానే, దాన్ని బ‌ట్టి ఈవెంట్ టైమ్‌, వేదిక ఫిక్స్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.ఈ రెండో వేడుక కూడా హైద‌రాబాద్‌లోనే ఉండొచ్చు. ప్రీ రిలీజ్‌కి చిరుని, మ‌రో ఈవెంట్ కి ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతున్నాడంటే ప్ర‌మోష‌న్లు ఏ రేంజులో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవొచ్చు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం పీక్స్‌లో సాగుతోంది. వారానికి ఓ పాట‌, రెండ్రోజుల‌కు ఓ కొత్త స్టిల్ విడుద‌ల చేసి హంగామా చేస్తోంది చిత్ర‌బృందం. మున్ముందు ఇంకెంన్ని ట్రీట్లు ఇవ్వ‌బోతోందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

2018-19 పంచాయతీ అవార్డుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం 15 అవార్డులు ఇచ్చింది. " ఈ - పంచాయతీ పురస్కార్‌" కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. సాధారణ కేటగిరిలో ప.గో...

HOT NEWS

[X] Close
[X] Close