టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఫామ్‌లోకి వచ్చాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ కూడా కసిగా చేసిన సినిమానే. డివైడ్ టాక్ ఎలా ఉన్నా, వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. నటుడిగా ఎన్టీఆర్ రేంజ్ ఈ సినిమాతో ఇంకాస్త పెరిగింది. ఎమోషన్లను బాగా క్యారీ చేశాడని, స్టార్ డమ్‌ని వదిలి కేవలం కథకూ, పాత్రకే ప్రాధాన్యం ఇచ్చాడని విమర్శకులు కూడా ఎన్టీఆర్‌కి మార్కులేసేశారు. గురువారం ఓ రేంజులో వసూళ్లొచ్చాయి. శుక్రవారం ఆ తాకిడి తగ్గినా శని, ఆదివారాలు భారీ వసూళ్లు దక్కించుకొనే అవకాశం ఉంది. సోమవారం సెలవు కావడంతో… ఈ సినిమా వసూళ్లు ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సినిమా సేఫ్ జోన్లో పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ రిపోర్ట్ విషయంలో ఎన్టీఆర్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తొలి రోజు వసూళ్లలో ఆల్ టైమ్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నామన్న సంగతి తెలియగానే.. టీమ్ అంతటికీ ఎన్టీఆర్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడట. ఈ పార్టీలో జనతా గ్యారేజ్ టీమ్ మొత్తం పాల్గొందని సమాచారం. పార్టీలో ఎన్టీఆర్ చాలా ఉల్లాసంగా గడిపాడని, వసూళ్ల గురించి నిర్మాతల్ని అడిగి తెలుసుకొన్నాడని తెలుస్తోంది. అంతేకాదు.. సినిమా ప్రమోషన్లు భారీగా పెంచమని కూడా సూచించాడట. శుక్రవారం ఉదయమే.. కొరటాల శివ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇదేనని సమాచారం. మంగళవారం నుంచి.. ప్రమోషన్లలో సమంత, నిత్యమీనన్, మోహన్‌లాల్‌లు పాల్గొనే అవకాశం ఉంది.