కాల‌ర్ ఎత్తుకొనే సినిమా ఇది: ఎన్టీఆర్‌

క‌ల్యాణ్ రామ్ న‌టిస్తూ, నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘బింబిసార‌’. ఆగ‌స్టు 5న రాబోతోంది. ఈ సినిమాపై క‌ల్యాణ్‌రామ్ చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ఈసారి ష్యూర్ షాట్ హిట్ అంటున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే మాట చెప్పాడు. ఈరోజు జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆల్రెడీ ఈ సినిమా చూసేసిన ఎన్టీఆర్‌… ఇప్పుడు రివ్యూ కూడా ఇచ్చేశాడు. ”అదృష్ట‌వ‌శాత్తూ ఈ సినిమా నేను ముందే చూశా. ద‌ర్శ‌కుడు క‌థ‌ని ఎంత క‌సిగా చెప్పాడో, అంత‌కంటే గొప్ప‌గా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా చూసి అభిమానులంతా కాల‌ర్ ఎగ‌రేస్తారు. క‌ల్యాణ్ రామ్ అన్న కెరీర్‌ని బింబిసార‌కు ముందు ఆ త‌ర‌వాత అని చెప్పుకొంటారు. ఈ పాత్ర కోసం అన్న‌య్య ర‌క్తం ధార‌బోశాడు. బింబిసార పాత్ర‌ని అన్న‌య్య త‌ప్ప మ‌రే న‌టుడూ చేయ‌లేడు..” అంటూ కితాబు ఇచ్చాడు. జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదని చాలా మంది చెబుతున్నార‌ని, అయితే తాను ఆ మాట న‌మ్మ‌న‌ని, మంచి సినిమా తీస్తే…. జ‌నాలు త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని బింబిసార అలాంటి సినిమానే అని ఎన్టీఆర్ చెప్పాడు. ఆగ‌స్టు 5న విడుద‌ల బింబిసార‌తో పాటుగా విడుద‌ల అవుతున్న ‘సీతారామం’ చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని, తెలుగు సినిమాని ముందుకు న‌డిపించాల‌ని ఎన్టీఆర్ కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close