అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో… ఎన్టీఆర్‌

తెలుగు సినిమాల షూటింగుల అడ్డా… అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఎన్టీఆర్ సంద‌డి చేస్తున్నాడు. త‌న కొత్త సినిమా `దేవ‌ర‌` షూటింగ్ అక్క‌డే జ‌రుగుతోంది. ఎన్టీఆర్ తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటోంది. 2 వారాల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీల‌క సన్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. దీంతో షూటింగ్ దాదాపుగా పూర్త‌వుతుంది. మ‌రో షెడ్యూల్ పాట‌ల కోసం కేటాయించారు. ఎన్టీఆర్ రెండు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో క‌నిపించే ఈ చిత్రంలో శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2024 వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా ఇదే. అందుకే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. `దేవ‌ర‌` 2 భాగాలుగా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 2024 వేస‌విలో తొలి భాగం విడుద‌ల అవుతుంది. మ‌రో ఆరు నెల‌ల విరామం త‌ర‌వాత‌.. రెండో భాగం వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

యానిమ‌ల్ మిషన్ గ‌న్ @ రూ.50 ల‌క్ష‌లు

ఈమ‌ధ్య యాక్ష‌న్ సినిమాల్లో పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు శ‌త్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్ర‌మ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు...
video

క‌థంతా దాచేసి.. ట్రైల‌ర్ క‌ట్ చేశారు!

https://www.youtube.com/watch?v=GnO4cOx_wFQ నితిన్ - వ‌క్కంతం వంశీ సినిమా `ఎక్ట్రా ఆర్డిన‌రీ మెన్‌` ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close