ఎన్టీఆర్ స్పెష‌ల్ : కోటి అందుకున్న తొలి హీరో!

ఇప్ప‌ట్లో కోటంటే పెద్ద లెక్కే లేదు. ఒక‌ట్రెండు హిట్లు కొట్టిన కుర్ర హీరోయిన్లే కోటికి ప‌డ‌గ‌లెత్తేస్తున్నారు. బ‌డా హీరోల పారితోషికం ఇప్పుడు 50 నుంచి 100 కోట్ల వైపు ప‌రుగులు పెడుతోంది. ప్ర‌భాస్ వంద కోట్ల హీరో అయిపోయాడు కూడా. అయితే.. అప్ప‌ట్లో కోటి అందుకున్న తొలి క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ చ‌రిత్ర సృష్టించారు. మేజ‌ర్ చంద్ర‌కాంత్ చిత్రానికి గానూ ఎన్టీఆర్ కోటి రూపాయ‌ల పారితోషికం అందుకున్నారు. 1993లో విడుద‌లైన సినిమా అది. మోహ‌న్ బాబు నిర్మాత‌. అప్ప‌ట్లో అదే రికార్డ్‌. ఆ త‌ర‌వాత కొన్నాళ్ల‌కు చిరంజీవి ఈ రికార్డుని బ‌ద్ద‌లు కొట్టారు. అప్ప‌టి నుంచీ హీరోల పారితోషికం సినిమా సినిమాకీ పెరుగుతూనే ఉంది.

`మ‌న‌దేశం`తో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్‌.. ఆ సినిమాకిగానూ అందుకొన్న పారితోషికం 200 మాత్ర‌మే. అప్ప‌ట్లో న‌టీన‌టులంతా కంపెనీ ఆర్టిస్టులే. అందుకే జీతాలు త‌ప్ప‌ పారితోషికం కూడా పెద్ద‌గా ఉండేది కాదు. న‌టుడిగా బిజీ అయిన‌ప్ప‌టికీ, పారితోషికం పెంచేవారు కాదు ఎన్టీఆర్‌. నిర్మాత‌ల‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండాల‌న్న త‌ప‌న ఆయ‌న‌ది. ల‌క్ష రూపాయ‌ల పారితోషికం అందుకోవ‌డానికి ఎన్టీఆర్‌కి ప‌దేళ్లు ప‌ట్టింది. ఎన్టీఆర్ త‌క్కువ పారితోషికం తీసుకోవ‌డం ఆత‌రంలోని మిగిలిన హీరోల‌కు మింగుడు ప‌డేది కాదు. ఎందుకంటే… ఏ హీరోకైనా ఎన్టీఆర్ కంటే త‌క్కువ పారితోషిక‌మే అందేది. `ఎన్టీఆరే అంత త‌క్కువ తీసుకుంటున్న‌ప్పుడు మీకు ఎక్కువ పారితోషికం ఇవ్వ‌డం స‌రికాదు..` అని నిర్మాత‌లు చెప్పేవారు. దాంతో.. ఎన్టీఆర్ పారితోషికం ఎప్పుడు పెంచుతారా? అని మిగిలిన హీరోలు ఎదురు చూసేవారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడ‌గొద్దంటూనే అప్ డేట్ ఇచ్చిన ఎన్టీఆర్‌

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. కొర‌టాల సినిమా ఓకే అయినా దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు....

పవన్ ఫ్యాన్స్‌తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు ఆన్ లైన్‌లో తనకు ఉపయోగపడతారనుకున్న వారిపై పొగడ్తలు.. తనకు ఇష్టం లేని వారిపై తిట్లు కురిపిస్తూ టైం పాస్ చేస్తూంటారు....

జగన్ అడ్డుకోకపోతే 10 రోజుల్లోనే వివేకా హంతకులు దొరికేవారు : దస్తగిరి

వివేకా హత్యకేసులో త్వరలో నిజాలు తెలనున్నాయని, వాస్తవాలు బయటపడే రోజు దగ్గర పడిందని దస్తగిరి అన్నారు. ఇప్పటి వరకూ దస్తగిరి చెప్పింది అబద్దమని అన్నారని, ఇకపై తాను చెప్పిన నిజాలు ఏంటో...

ఒక్క బటన్ నొక్కండి – మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపు !

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగసభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్క బటన్ నొక్కితే దేశమంతా మారిపోతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం చేయమని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close