మహానాయకుడు రివ్యూ – యాత్ర…కుట్ర..విజయం..విషాదం

తెలుగు360 రేటింగ్‌: 2.75/5

రామాయణాన్ని మూడు ముక్కల్లో కట్టె, కొట్ట, తెచ్చె అన్నట్లు చెప్పినట్లుగా, ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు గురించి చెప్పాలంటే ఇలాగే చెప్పాలేమో? ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర, ఆయన ప్రభుత్వంపై నాదెండ్ల సాయంతో కాంగ్రెస్ కుట్ర, ఆపై చంద్రబాబు వ్యూహరచనతో విజయం, కానీ రెండు భాగాలు ఏదో పాయింట్ దగ్గర ముగించాలి కాబట్టి బసవతారకం మరణంతో విషాదాంతం. ఇదీ సినిమా. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే సాధారణంగా సినిమాలకు ఎత్తుగడ..నడక, ఉత్కంఠ..ముగింపు వంటివి వుంటాయి. పొలిటికల్ సినిమాలకు ఈ మాదిరి లైన్ ఆఫ్ ఆర్డర్ వుంటుంది కానీ, నడక దగ్గర తేడా వస్తుంది.

అందులోనూ అందరికీ తెలిసిన విషయాన్ని చెబుతున్నా, చూపిస్తున్నా, పెద్దగా ఉత్కంఠ అనేది వుండదు. ఎన్టీఆర్ సినిమా, రాజకీయ జీవితాలు రెండూ తెరచిన పుస్తకాలే. అందులో కొత్త సంగతి ఏమీ చేర్చడానికి కానీ, జనాలకు తెలియని పేజీలను తెరచి చూపించడానికి కానీ బయోపిక్ మేకర్లకు అవకాశం తక్కువ. అందువల్ల సినిమా ఏమిటీ అంటే, ఇలా నాలుగు ముక్కల్లో చెప్పాల్సిందే.

ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ఆయన రాజకీయ రంగ ప్రవేశంతో ముగిసిన సంగతి తెలిసిందే. రెండో భాగం ఎన్టీఆర్ బాల్య సన్నివేశాలు, తొలిసగంలో విస్మరించిన బసవతారకంతో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు లైట్ గా టచ్ చేసి, నేరుగా పార్టీ ప్రకటన దగ్గరకు వచ్చారు. అక్కడ నుంచి చైతన్య రథ యాత్ర, ఎన్నికలు, విజయం, సంక్షేమ పథకాలు, ఎన్టీఆర్ వ్యవహార శైలి సాంప్రదాయ రాజకీయ నాయకులకు నప్పకపోవడం, నాదెండ్ల సారథ్యంలో తిరుగుబాటు, ఆపై చంధ్రబాబు చాణక్యం, ఢిల్లీపై తిరుగుబాటు, పోరు, మళ్లీ అధికారం చేపట్టడంతో పూర్తవుతుంది. కానీ ఈ మధ్యలో బసవతారకం క్యాన్సర్ బారినపడడం, ఆమె మరణించడంతో బయోపిక్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. వాస్తవానికి ఆ తరువాత భాగం తీసినా, తీయకపోయినా, ఒక ఇండికేషన్ ఇచ్చి, ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టి వుంటే విమర్శలకు అవకాశం లేకుండా వుండేది.

సరే, ఆ విషయం పక్కన పెట్టి బయోపిక్ పార్ట్ 2 ఎలా వుందో చూద్దాం. బయోపిక్ మొదటి భాగానికి పూర్తి కాంట్రాస్ట్ గా వుంటుంది రెండోభాగం. తొలిభాగం పిల్ల గోదారిలా నెమ్మదిగా ప్రారంభమై, నెమ్మదిగానే సాగుతుంది. ఒక్క ఎమర్జెన్సీ సీన్ లో తప్ప ఎక్కడా సినిమాను తారాస్థాయి మీటర్ కు చేర్చకుండా నడిపారు. అందువల్ల క్లాస్ ఆడియన్స్ అంతా ఆ సినిమాను బాగుందనే అన్నారు. ఇది పక్కా దర్శకుడు క్రిష్ స్టయిల్ అని మెచ్చుకున్నారు.

కానీ రెండో భాగం అలా కాదు. ముదిమి మీద పడిన తరువాత ఎన్టీఆర్ ఠీవి, ఆయనలో తొంగిచూసే దర్పం, ఆవేశం అన్నీ కనిపిస్తాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించే తీరుకానీ, చైతన్యరథం కవర్ ను తొలగించే సన్నివేశం కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇలా ఓ జోష్ తో, మాస్ కు లేదా పార్టీ లేదా ఎన్టీఆర్ అభిమానులకు నచ్చే ఓ తరహా వేగవంతమైన చిత్రీకరణను రెండోభాగానికి క్రిష్ ఎంచుకున్నాడు. ఒకసారి ఎన్టీఆర్ చైతన్య రథం అధిరోహించాక, సినిమా ఎక్కడా డౌన్ కాదు. సినిమా ఇక మరో అయిదు నిమషాల్లో ముగుస్తుంది అనే వరకు అదే తీరుగా సాగుతుంది. మధ్య మధ్య బసవతారకం వ్యవహారాలు చొప్పించారు.

ఇక్కడ రెండు విషయాలు వున్నాయి. ఒకటి తీసిన సినిమా ఎలా వుంది? అన్నది. రెండోది ఇలా కాకుండా వుంటే అన్నది.

తీసిన సినిమా మేరకు ఎన్టీఆర్ అభిమానులకు నచ్చుతుంది. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలోకి దాదాపు పరకాయప్రవేశం చేసినంతగా ఒదిగిపోయారు. డైలాగులు లేని సీన్లు అయినా, డైలాగులు వున్న సీన్లు అయితే ఆయన అద్భుతంగా పండించాడు. అయితే సమస్య ఒకటే విషయం అందరికీ తెలిసింది కావడం, ముందు ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ లేకపోవడం సమస్య. సినిమా మేకింగ్ లో సమస్య లేదు. విషయం చెప్పడంలో సమస్య లేదు. వచ్చిన సమస్య అల్లా చెప్పిన విషయంలోనే . ఆ విషయాన్ని అంతకన్నా గొప్పగా చెప్పే అవకాశం లేదు అక్కడ.

అయితే దర్శకుడు క్రిష్ ఎందుకు విస్మరించారో లేదా ఇది రెండో భాగం, పొలిటకల్ పార్ట్, ఇది ఇలా వుండాలని అనుకున్నారో కానీ, కుటుంబ వ్యవహారాలకు ఇక్కడా పెద్ద పీట వేయలేదు. తొలిభాగం కన్నా మలి భాగంలో ఫ్యామిలీ సభ్యులను ఎక్కువే చూపించారు. వాళ్ల మధ్య సంభాషణలు వున్నాయి. కానీ మళ్లీ భావోద్వేగాలు, అనుబంధాల దగ్గరకు వచ్చేసరికి కేవలం ఎన్టీఆర్-బసవతారకం మాత్రమే. అంతకు మించి ఎన్టీఆర్ తన పిల్లలతో కాస్తయినా ప్రేమగా, అభిమానంగా మసిలినట్లు కానీ, వాళ్లకు బుద్ధులు, సుద్దులు చెప్పినట్లు కూడా సీన్లు రాసుకోలేకపోయారు.

తెలిసిన విషయాల కన్నా , తెలిసిన విషయాలను కొత్తగా చెప్పాలన్న ఆలోచనను దర్శకుడు క్రిష్ విస్మరించినట్లు కనిపిస్తుంది. అలా విస్మరించడం వల్ల సంఘటనల సమాహారం లేదా డాక్యుమెంటరీ అన్న లుక్ నుంచి సినిమా తప్పించుకోలేకపోయింది. అందువల్ల కమర్షియల్ విజయం అన్నది అనుమానాస్పదం అవుతుంది. ఎన్టీఆర్ కాషాయం కట్టినందకు రీజన్ చూపించానని దర్శకుడు అనుకుంటే అనుకుని వుండొచ్చు కానీ, అందులో క్లారిటీ మిస్ అయింది. కాషాయం కట్టిన తరువాత, నమాతా..న పిత అంటూ ఆర్ ఆర్ వేసిన తరువాత, వెండిగిన్నెలు, వెండిపళ్లాల్లో భోజనం అన్న విజువల్ సరికాదు.

రెండో భాగంలో క్రైసిస్ మేనేజ్ మెంట్, క్యాంప్ ల నిర్వహణ అన్న విషయాల్లో చంద్రబాబుదే అంతా అన్నట్లు చూపించడం చాలా వరకు వాస్తవమే కావచ్చు. కానీ రాజకీయాల నేపథ్యంలో ఇదంతా చంద్రబాబు కోసం, ఆయనను హైలైట్ చేయడం కోసం చేసారన్న విమర్శ తప్పదు.

నటీనటులు, నటన విషయానికి వస్తే, ముందే చెప్పినట్లు బాలయ్య తన తండ్రి పాత్రలోకి ఒదిగిపోయి నటించారు. గవర్నర్ ను ఢీకొనే సన్నివేశం కానీ, అసెంబ్లీ సన్నివేశం కానీ, డైలాగులు లేకుండానే చూపులతో రక్తి కట్టించారు. విద్యాబాలన్ తొలిభాగం తొలి సీన్ నుంచి, మలి భాగం ఆఖరి సీన్ వరకు ఒకటే తరహా చూపులు, హావభావాలు తప్ప, సీన్ కు తగినట్లు కనిపించలేదు. చంద్రబాబుగా రానా పక్కగా సూటయ్యారు. మిగిలిన వారంతా ఒకె.

తొలిభాగంలో నేపథ్య సంగీతం సున్నితంగా సాగితే, మలిభాగం లో సన్నివేశాలను మించిన స్థాయిలో వుంటుంది. బహుశా మాస్ జనాలకు ఆర్ ఆర్ ఇలా వుంటేనే బాగుంటుదని కీరవాణి భావించారేమో? సినిమాటోగ్రఫీ బాగుంది. బుర్రా సాయి మాధవ్ కలానికి రెండో భాగంలో పెద్దగా అవకాశం రాలేదు. వచ్చిన చోటల్లా మెరపులు మెరిసాయి.

మొత్తం మీద చూసుకుంటే, బయోపిక్ తొలిభాగం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటే, మలిభాగం వేరే తరహా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏ భాగం కూడా పూర్తిగా అన్ని తరహా ప్రేక్షకులకు నచ్చేలా లేకపోవడానికి ఒకటే కారణం, ఇది బయోపిక్ కావడం. దానికి వుండే మైనస్ లు, పరిమితులు దానికి వుండడం.

ఫైనల్ టచ్….’అభిమాన’ నాయకుడు

తెలుగు360 రేటింగ్‌: 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close