ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత‌… మేట‌రేంటి?

ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో గెలిచి, ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి పీఠాన్నెక్కి సంచ‌ల‌నం సృష్టించింది జ‌య‌ల‌లిత‌. ఈ గెల‌పు.. మామూలు గెలుపు కాదు. ఎగ్జిట్ పోల్స్‌కే షాకిచ్చిన‌.. గెలుపు. అంద‌రి అంచ‌నాల‌నూ త‌ల‌కిందులు చేసిన గెలుపు. అందుకే దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు ఆమెకు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌ ప్ర‌ముఖులు ఆమెకు శుభాకాంక్ష‌లు అందిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ కూడా జ‌య‌ల‌లిత‌ను వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌బోతున్నాడ‌ని, ఆమెకు విషెష్ చెప్పి వ‌స్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ జ‌య‌ల‌లితను క‌లుసుకోవ‌డానికి ఆపాయింట్‌మెంట్ కూడా తీసుకొన్నాడ‌ని, ఒక‌ట్రెండు రోజుల్లో అమ్మ‌ని క‌లుస్తాడ‌ని చెప్పుకొంటున్నారు. జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ చెన్నైలో ఉండ‌డంతో ఈ వార్త కు మ‌రింత బ‌లం చేకూరింది.

అయితే.. ఈ వార్త‌లో ఎంత‌మాత్రం నిజం లేద‌ట‌. జ‌య‌ల‌లిత‌ను ఎన్టీఆర్ క‌లుసుకొనే పోగ్రాం ఏమీ లేద‌ని, అస‌లు అపాయింట్‌మెంటే తీసుకోలేద‌ని ఎన్టీఆర్ పీఆర్ వ‌ర్గం డిక్లేర్ చేసింది. ఆ వార్త‌ల‌న్నీ క‌ల్పితాల‌ని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్ దృష్టి ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ మీదే ఉంద‌ని, మ‌రో విష‌యం ఆలోచించ‌డం లేద‌ని ఎన్టీఆర్ కాంపౌండ్ వ‌ర్గాలు ధృవీక‌రించాయి. సో.. అమ్మ‌ను క‌లుసుకోవ‌డానికి ఎన్టీఆర్ వెళ్లడం లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close