ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. ప్రశాంత్ నీల్ కి ఉన్న బ్రాండ్, ఎన్టీఆర్ స్టార్ డమ్ కలగలిపి ఈ సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ప్రస్తుతం రాకెట్ వేగంతో షూటింగ్ జరుగుతోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాట తెరకెక్కించారు. ఆ పాట సినిమాలోని చాలా కీలకమైన సమయంలో వస్తుందని, ఈ పాటలోని ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది.
మరోవైపు `డ్రాగన్`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. స్క్రిప్టులో ఇప్పుడు కీలకమైన మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. సాధారణంగా స్క్రిప్టు లాక్ చేసిన తరవాత, చిన్న చిన్న మార్పులు చేయడానికి కూడా ప్రశాంత్ నీల్ ఒప్పుకోడు. కానీ సినిమా రేంజ్‌ని, ఎన్టీఆర్ సలహాల్ని దృష్టిలో ఉంచుకొన్న ప్రశాంత్ నీల్… స్క్రిప్టుని షూటింగ్ దశలోనూ ఫైన్ ట్యూన్ చేస్తున్నాడని సమాచారం. షెడ్యూల్ గ్యాప్ లో.. ప్రశాంత్ నీల్ మళ్లీ స్క్రిప్టుపై రీ వర్క్ చేస్తున్నాడని, ఎన్టీఆర్ కూడా రైటింగ్ స్టేజ్ నుంచే ప్రశాంత్ నీల్ తో ట్రావెల్ చేస్తున్నాడని తెలుస్తోంది.
కేజీఎఫ్ 1, 2 తరవాత ప్రశాంత్ నీల్ నుంచి ‘సలార్’ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర హిట్టే. కానీ.. ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి. ఇంకాస్త బాగా తీర్చిదిద్దాల్సిన స్క్రిప్టు అది. కానీ ప్రశాంత్ నీల్ ఆ అవకాశాన్ని చేజార్చుకొన్నాడు. అయితే ఆ తప్పు ఈసారి జరక్కూడదని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. అందుకే షూటింగ్ మధ్య గ్యాప్ లోకూడా కథలో మార్పులు, చేర్పులకు పూనుకొంటున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంతిమంగా కావాల్సింద బెటర్ అవుట్ పుట్. అది ఇస్తే చాలు.