వృత్తిగత జీవితంతో పాటుగా, వృత్తిగత జీవితానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు మన స్టార్ హీరోలు. వీలున్నప్పుడల్లా కుటుంబంతో గడపాలని చూస్తున్నారు. ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్పులు, పార్టీలు ప్లాన్ చేసుకొంటున్నారు. ఎన్టీఆర్ కూడా పక్కా ఫ్యామిలీ మెనే. ఏమాత్రం ఖాళీ దొరికినా, భార్యా పిల్లలకు సమయం కేటాయిస్తుంటారు. ప్రతీ సందర్భాన్నీ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకొంటుంటారు. మార్చి 26న ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నాడని టాక్. తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటుగా ‘డ్రాగన్’ టీమ్ కూడా ఈ పార్టీలో పాలు పంచుకోనుందని తెలుస్తోంది. ప్రతీ ఏటా ప్రణతి పుట్టిన రోజున ఇలా పార్టీలు ఇవ్వడం ఎన్టీఆర్కి అలవాటే. కాకపోతే ఈసారి ఈ పార్టీ మరింత గ్రాండ్ గా, లావీష్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ పార్టీకి ఎవరెవరు వస్తారు? అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు `దేవర 2`కి సంబంధించిన వర్క్ కూడా జరుగుతోంది. కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈలోగా కొన్ని కొత్త కథలు కూడా వింటున్నారని సమాచారం. ‘డ్రాగన్’ పూర్తయిన తరవాత ఎన్టీఆర్ ఏ ప్రాజెక్ట్ చేస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. కొత్త కథ ఏమైనా ఎగ్జయిట్ చేస్తే ఆ సినిమా మొదలెడతారు. లేదంటే ‘దేవర 2’ ముందుకు తీసుకెళ్తారు.
