వార్ 2 తర్వాత ఎన్టీఆర్ మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 28న హైదరాబాద్లో జరిగే కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు యంగ్ టైగర్. రిషబ్ శెట్టి కాంతారకి ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1 వస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ రాకతో సినిమాకి మరింత బజ్ వస్తుందని టీం నమ్మకంగా వుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార మంచి విజయాన్ని సాధించింది. తెలుగు రిలీజ్ చేసిన నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ ప్రీక్వెల్ పై కూడా మంచి అంచనాలు వున్నాయి.