చిరంజీవి కథానాయకుడిగా నటించిన `వాల్తేరు వీరయ్య` బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు జాలరిగా నటిస్తున్నాడు. ఈ పాత్రలో చాలా ఛాయలుంటాయి. జాలరి స్మగ్లర్‌గా, గ్యాంగ్ స్టర్ గా మారడమే కథ. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ఈ సినిమాలోనూ… ఎన్టీఆర్ జాలరిగా కనిపించబోతున్నట్టు టాక్. ఆ పాత్రలోనూ ఇలానే చాలా షేడ్స్ ఉంటాయట. కొరటాల శివ కథలన్నీ కమర్షియల్ వే. కాకపోతే వాటిలో ఓ సామాజిక నేపథ్యం ఉంటుంది. ఈసారి… సముద్ర జలాలు, కలుషిత నీరు.. ఇలా చాలా పాయింట్లు ఎత్తుకొన్నాడట కొరటాల. ఎన్టీఆర్ పాత్ర, వాటి గెటప్పులు కూడా ఆసక్తికరంగా ఉంటాయని టాక్. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ చిత్రబృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సంక్రాంతికి… ఫస్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యేడాదంతా కొరటాల శివ సినిమాతోనే ఎన్టీఆర్ బిజీ అవ్వబోతున్నాడు. 2024లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.