ఎన్టీఆర్’ బ‌యోపిక్‌లో చంద్ర‌బాబు ‘సాహ‌సాలు’

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ వెనుక రెండు బృహ‌త్త‌ర ఉద్దేశ్యాలు, ల‌క్ష్యాలు ఉన్నాయి. ఒక‌టి… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న‌ ఎన్నిక‌ల‌కు `తెలుగుదేశం` విశిష్ట‌త‌ని, ఆనాడు ఎన్టీఆర్ చేసిన మంచి ప‌నుల్ని ఏక‌ర‌వు పెట్ట‌డం, రెండోది… టీడీపీ ఆవిర్భావంలో చంద్ర‌బాబు నాయుడు చేసిన కృషిని 70 ఎం.ఎంలో చూపించ‌డం. ఇది `ఎన్టీఆర్‌` క‌థే అయినా… ఆయ‌న ఆల్లుడిలోని ధైర్య సాహ‌సాలు, చాణిక్య నీతిని మ‌రోసారి నొక్కి వ‌క్కాణించ‌డానికి ఈ సినిమాని ఓ వేదిక చేసుకున్నారు. ఆ పాత్ర‌కు రానాని ఎంచుకోవ‌డం వెనుకే ఆ పాత్ర‌కు ‘స్టార్‌’ స్టేట‌స్ ఇవ్వాల‌న్న ఉద్దేశ్యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ని ఓస్థాయిలో చూపించే కృషి చేశారు. చంద్ర‌బాబు నాయుడు ముందు కాంగ్రెస్ పార్టీవాడే. ఎన్టీఆర్‌పై పోటీకి దిగి ఘోరంగా ఓడిపోయిన చ‌రిత్ర ఉంది. ఆ విష‌యాల్ని సైతం.. ఈ బ‌యోపిక్‌లో చూపించారు. కాంగ్రెస్ వ‌దిలి.. చంద్ర‌బాబు టీడీపీలో ఎందుకు రావాల్సివ‌చ్చింది? క్లిష్ట స‌మ‌యాల్లో మావ‌య్య‌కు ఎన్ని విలువైన స‌ల‌హాలు ఇచ్చాడు? అనే కోణంలోనూ చంద్ర‌బాబు నాయుడు పాత్ర సాగ‌బోతోంద‌ని స‌మాచారం.

అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంది. తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లోనే అదో కీల‌క‌ఘ‌ట్టం. నాదెండ్ల భాస్క‌ర్ సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి అప్ప‌ట్లో తెలుగుదేశం ఎం.ఎల్‌.ఏ ల‌ను ఓ రైలులో ఢిల్లీకి త‌ర‌లించాల్సివ‌చ్చింది. మార్గ‌మ‌ధ్యంలో రైలుపై దాడి చేసి, ఎం.ఎల్‌.ఏ ల‌ను లాక్కుని పోవాల‌ని కొంత‌మంది దుండ‌గులు ప్ర‌య‌త్నిస్తుంటారు. వాళ్ల నుంచి కాపాడుకుంటూ, ఈ ఎం.ఎల్‌.ఏ ల‌ను చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి ఎలా చేర్చాడ‌న్న‌ది ఈ ఎపిసోడ్ సారాంశం. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు క‌లిపి చూసినా… అందులో ఉండే యాక్ష‌న్ ఎపిసోడ్ ఇదొక్క‌టే అని స‌మాచారం. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం చంద్ర‌బాబు నాయుడు సాహ‌సాల్ని చూపించ‌డానికి వాడుకున్నారు. ఇదంతా చ‌రిత్ర‌లో జ‌రిగిన‌దే. కాక‌పోతే…. చంద్ర‌బాబుని ఎలివేట్ చేసిన విధానం చూస్తే.. తెర‌పై ఓ హీరోని చూస్తున్నామా? అన్న‌ట్టే ఉంటుందట‌. ఎంతైనా… ఈ సినిమా వెనుక వ్యూహాల‌న్నీ చంద్ర‌బాబు నాయుడువే. ఈ సినిమా మొద‌లెట్టే ముందు స్క్రిప్టుని కూడా ఆయ‌న‌కు వినిపించే గ్రీన్ సిగ్న‌ల్ అందుకున్నారు. బాబు పాత్ర‌ని ఆ మాత్రం ఎలివేట్ చేయ‌కపోతే ఏం బాగుంటుంది? మ‌రి ఈ ట్రైన్ ఎపిసోడ్ ఏ స్థాయిలో పేలిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close