ఏఎన్నార్ బ‌యోపిక్‌.. నాగ్ చేతుల్లోనే

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న‌ప్పుడే ‘ఏఎన్నార్‌’ బ‌యోపిక్ సంగ‌తేంట‌న్న టాపిక్ వ‌చ్చింది. ఈ విష‌య‌మై నాగార్జున కూడా స్పందించాడు. ‘నాన్న‌గారి జీవితంలో మ‌రీ సినిమాటిక్ మ‌లుపులేం ఉండ‌వు. బ‌యోపిక్‌కి స‌రితూగ‌దు’ అని తేల్చేశాడు. కాక‌పోతే…ఈమ‌ధ్య బ‌యోపిక్‌ల హ‌వా ఎక్కువైంది. దాంతో పాటు.. క‌మ‌ర్షియ‌ల్‌గానూ బాగా వ‌ర్క‌వుట్ అవుతున్నాయి. నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌ని ఎవ‌రు చేస్తారు? అని అడిగితే… సుమంత్‌, నాగ‌చైత‌న్య‌లు ఎదురుగా క‌నిపిస్తున్నారు. అందుకే బ‌యోపిక్ విష‌యంలో నాగ్ పున‌రాలోచించుకునే ఛాన్సుంది. ఒక‌వేళ నాగ్ కాక‌పోయినా.. మ‌రో నిర్మాత ఎవ‌రైనా స‌రే… ఏఎన్నార్ బ‌యోపిక్‌ని నెత్తిమీద వేసుకునే అవ‌కాశాల్నీ కొట్టి పారేయ‌లేం.

‘అక్కినేని బ‌యోపిక్ తీస్తానంటే న‌టించ‌డానికి మీరు సిద్ధ‌మేనా’ అని సుమంత్‌ని అడిగితే…. ”తాత‌గారి బ‌యోపిక్‌పై నిర్ణ‌యం నాగార్జున మావ‌య్య‌దే. ఆయ‌న ఏం చెబితే అది చేస్తాం. ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయ‌నే కాబ‌ట్టి.. ఆయ‌న చెప్పిన ప్ర‌కారం న‌డుచుకునే బాధ్య‌త మాపై ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మా మ‌ధ్య తాత‌గారి బ‌యోపిక్ గురించిన టాపిక్ రాలేదు” అని క్లారిటీగా చెప్పేశాడు. సో.. నాగ్ ఓకే అనుకుంటే మాత్రం ఏఎన్నార్ బ‌యోపిక్‌కి అవ‌కాశాలున్నాయ‌న్న‌మాట‌. ‘మ‌నం’ సినిమాతో నాన్న‌కి ఓ గొప్ప వీడ్కోలు ప‌లికిన నాగ్‌… బ‌యోపిక్ తీస్తే… అది మ‌రో చ‌రిత్ర అవుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండో వన్డేలోనూ టీమిండియా “కంగారు”..!

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాట్స్‌మెన్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ కొండంత లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. దాన్ని అందుకునేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు కానీ.., దరి దాపుల్లోకి కూడా రావడం...

మోడీ విధానాల వల్లే హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు : అమిత్ షా

కేంద్ర నిధులపై కేసీఆర్ సెక్రటేరియట్‌కు వస్తే తెలుస్తుదందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సెటైర్ వేశారు. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల చివరి రోజుల ఆయన ప్రచారానికి వచ్చారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు....

ఈ సారి కూడా వ్యతిరేక మీడియాకు నో పర్మిషన్..!

అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. అయితే మీడియాకు మాత్రం అందరికీ పర్మిషన్ దొరకడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని టీవీ చానళ్లను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానిచ్చేందుకు స్పీకర్ తమ్మినేని...

మంత్రి పేర్ని నానిపై “తాపీ”తో దాడి..!

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై ఓ తాపీ మేస్త్రి తాపీతో దాడికి దిగాడు. తాపీ తీసుకుని పొట్టలో పొడవడానికి ప్రయత్నించాడు. గుర్తించిన పేర్ని నాని పక్కుకు తప్పుకున్నాడు. ఈ...

HOT NEWS

[X] Close
[X] Close