మీడియా వాచ్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ఎన్టీవీ దాడి!

రేటింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలుస్తున్న ఎన్టీవీ తమ స్థానాన్ని వ్యాపార దురుద్దేశాలకు వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని కొద్ది రోజులుగా అదే పనిగా కథనాలు రాస్తోంది. ప్రసారం చేస్తున్నారు. తమ వాదనకు అనుకూలంగా మాట్లాడేవారిని తీసుకొచ్చి అదే జరుగుతోందని చెప్పిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే ఎన్టీవీ చెప్పే కారణం జీవో 111ని రద్దు చేయడం. ఇప్పుడు ఎక్కడెక్కడో ఇళ్లు కొనాలనుకున్నవారంతా.. ఆ జీవోను రద్దు చేసినందు వల్ల వెళ్లి.. ఆ ఏరియాల్లో ఇళ్లు కొనాలని ఆగిపోతున్నారట. ధరలు తగ్గిపోతాయని అనుకుంటున్నారట.

అపార్టుమెంట్లకు బదులు ఇండిపెండెంట్ హౌస్‌లు కొనాలనే ఆలోచన చేస్తున్నారు. అన్నీ ఎన్టీవీ వాళ్లే చెబుతున్నారు. కొనుగోలుదారులు ఏమనుకుటున్నారో మాత్రం చెప్పడం లేదు. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దానికి కారణం కొనుగోలు తగ్గిపోవడం కాదు. రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరగడం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా అపార్టుమెంట్ కనీసం రూ. యాభై లక్షలు ఉంటోంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ. నాలుగైదు లక్షలు ఖర్చవుతోంది.దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నారు. కొనుగోళ్లు తగ్గిపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

అయితే ఎన్టీవీ మాత్రం… అందరూ జీవో 111 ఎత్తేసినందున.. కొనేవాళ్లు ఎవరైనా ఇక అక్కడే కొంటారు.. కొనాలన్న ఎజెండాతో ఈ స్టోరీలు రన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఎన్టీవీ రియల్ ఎస్టేట్ స్టోరీల వెనుక స్పష్టమైన వ్యాపార ఎజెండా ఉంది కానీ.. వాస్తవం లేదన్న అభిప్రాయం మాత్రం వ్యాపారుల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close