మీడియా వాచ్ : ఎన్టీవీ పరువు తీసిన నాగబాబు !

ఏపీలో సాక్షి మీడియా క్లోన్ చానల్స్ గా పేరు తెచ్చుకున్నాయి టీవీ 9 , ఎన్టీవీ.. ఈ రెండింటి పని… ప్రతిపక్షంపై యుద్ధం చేయడమే. అధికార పక్షానికి బాకా ఊదడమే. అయితే ఇందు కోసం న్యూస్ ఫేక్ చేసే స్థాయికి దిగజారిపోవడమే ఇప్పుడు తెలుగు మీడియాలో అత్యంత బాధాకమైన విషయం. దీనికి తాజా ఉదాహరణ నాగబాబు విషయంలో.. ఎన్టీవీ చేసింది. దీంతో ఎన్టీవీ వైపు అందరూ అదోలా చూసే పరిస్థితి ఏర్పడింది.

పొత్తులపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని… పొత్తులు ఫైనల్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారనేది నిర్ణయం తీసుకుంటామని కర్నూలు పర్యటనలో నాగబాబు మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎన్టీవీ ప్రతినిధికి కూడా అదే చెప్పారు. కానీ ఎన్టీవీ ప్రతినిధి పొత్తులు లేకుండా ఒంటరిగా 175 స్థానాలు పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించేసింది. ఆన్ లైన్‌లోనే కాదు.. ఆఫ్ లైన్ … లైవ్ లో కూడా అదే చెప్పింది. ఒక్కచోట ఏదో తప్పు జరిగిందో అనుకోవచ్చు.. కానీ పదే పదే అదే ప్రచారం చేసింది. దీంతో సహజంగానే నాగబాబు అలా అన్నారా అని అందరూ ఆరా తీశారు. ఈ వ్యవహారం జనసేన వర్గాల్లోనూ కలకలం రేపింది.

అసలు నాగబాబు ఏమన్నారో తెలిసిన తర్వాత.. అందరు ఎన్టీవీ విషయంలో.. ఎంతకు తెగించార్రా అనుకోవడం కామన్ అయిపోయింది. ఇదే విషయాన్ని నాగబాబు కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు తానేమన్నారు.. ఎన్టీవీ ఏం చెప్పిందో .. టూ విండో వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీవీ పరువు మరింత గంగలో కలిసిపోయినట్లయింది.

ఎన్టీవీకి వైసీపీ దగ్గరే. ఆ చానల్ కు ఏపీలో విపక్షాలు కలిసి పోటీ చేయకూడదని.. జగన్ మళ్లీ గెలవాలని ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. సాక్షికి కూడా అలాగే ఉంటుంది. టీవీ9కికూడా అలాగే ఉంటుంది . కానీ ఇలా ఫేక్ చేసి.. ఏదో రాజకీయ ట్విస్టులు ఇవ్వాలనుకుంటే.. ముందుగా పోయేది మీడియా సంస్థ పరువే. ఇప్పటికే అది చాలా వరకూ గంగలో కలిసిపోయింది. నాగబాబు ఇష్యూతో మరింతగా పోయింది. ఇప్పుడు మాది ప్రతిక్షణం ప్రజాహితం అని చెప్పుకుంటే.. కామెడీ అయిపోయేలా ఆ చానల్ తీరు మారిపోయిందని కామెంట్స్ సహజంగానే వస్తూంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close