తీవ్రంగా దాడులు చేసుకుంటున్న భారత్, పాకిస్తాన్ ఎందుకు ఒక్క సారిగా కాల్పుల విరమణ పాటించాయో చాలా మందికి తెలియడం లేదు. కానీ దీనికి కారణం అంటూ రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి పాకిస్తాన్ అణుబాంబులు ఆ దేశంలోనే పేలడం లేదా.. ప్రమాదకర పరిస్థితుల్లో లీక్ కావడం. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాలు అంటూ ఓ ఆర్డర్ వైరల్ అయింది. అది నిజమో కాదో స్పష్టత లేదు.
కానీ పాకిస్తాన్ అణు ఆయుధాలు దాచి పెట్టుకుందని ప్రచారం జరుగుతున్న కిరానా హిల్స్ అనే ప్రాంతంలో ఇప్పుడు అణుధార్మికత ఎక్కువగా ఉందని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. కిరానా హిల్స్ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల మధ్యలో ఉంటుంది. అక్కడే పాకిస్తాన్ అణు వ్యవహారాలు జరుగుతాయని అంటున్నారు. అక్కడ పాకిస్తాన్ ఓ ఎయిర్ బేస్ పెట్టుకుంది. ఆ ఎయిర్ బేస్ పై బారత్ దాడి చేసింది.
ఆ సమయంలో పాకిస్తాన్ అణుబాంబులకు నష్టం జరిగిందని అంటున్నారు. ఈ విషయం తెలియడంతో వెంటనే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అంటున్నారు. కిరానా హిల్స్ నుండి రేడియోఆక్టివ్ గ్యాస్ లీకేజ్ జరుగుతోందని, దీని కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కొన్ని అంతర్జాతీయ మీడియాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది నిజమే అయితే మాత్రం పాకిస్తాన్ దశాబ్దాల పాటు ఆ సమస్యలను ఎదుర్కొంటుంది.