సీఆర్డీఏ పరిధి మొత్తంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. విజయవాడకు శివారులో ఉండే నున్న గ్రామం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తోంది. అందుకే అక్కడ. రియల్ ఎస్టేట్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ఇళ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. మధ్యతరగతికి అందుబాటులో ఉండే ప్రాంతం కావడంతో ఎంక్వయిరీలు ఎక్కువగా ఉన్నాయి. కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
నున్నా విజయవాడ గ్రామీణ మండలంలో భాగం. ఇక్కడ ఎక్కువ మంది ఇండిపెండెంట్ హౌస్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్న , మధ్య తరగతి కుటుంబాల కోసం 2BHK, 3BHK అపార్ట్మెంట్ల నిర్మాణం పెరిగింది రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. సీఆర్డీఏ కూడా ఇక్కడ మెరుగైన వసతుల కల్పనకు ప్రయత్నిస్తోంది.
నున్నా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు క్రమంగా పెరుగుతున్నా అందుబాటులోనే ఉన్నాయి. చదరపు గజం భూమి ధర ప్రాంతాన్ని బట్టి 15,000 వరకు ఉంటుంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉంటే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అన్ని మౌలిక సదుపాయాలతో ఉండే గేటెడ్ కమ్యూనిటీల్లో వాటికి తగ్గట్లుగా రేట్లు. ఉంటాయి. డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్ 30 నుంచి నుండి రూ. 40 లక్షలకు లభిస్తున్నాయి. లగ్జరీ, సౌకర్యాలను బట్టి కొని విలాసవంతమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
నున్నా గ్రామంలో ధరలు సుమారు 10-15 శాతం వార్షిక వృద్ధిని చూశాయి. ఈ ట్రెండ్ రాబోయే సంవత్సరాల్లో కొనసాగే అవకాశం ఉంది. విజయవాడ సమీపంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు , రాజధాని ప్రాంత అభివృద్ధి నున్నాలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు జోష్ ఇస్తున్నాయి.