టీమిండియాకు వైట్ వాష్ రివర్స్ గిఫ్ట్ ఇచ్చిన కివీస్..!

టీ ట్వంటీల్లో కివీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. వన్డేలో.. ఆ చాన్స్ కివీస్‌కు ఇచ్చింది. వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో ఓడిపోయింది. కివీస్‌ చేతిలో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ కావడం… గత 39 ఏళ్లలో ఇదే మొదటి సారి. 1981లో టీమిండియాను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. మౌంట్‌ మాంగనూలో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ ఘనవిజయం సాధించింది. భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచినప్పటికీ.. న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా.. యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు 296 పరుగులు చేసింది.

తర్వాత 47.1 ఓవర్లలోనే కివీస్.. లక్ష్యాన్ని ఐదు వికెట్లను కోల్పోయి సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ సెంచరీ చేసి.. ఇన్నింగ్స్ కు పిల్లర్ నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఎవరూ సెంచరీ చేయకపోయినప్పటికీ… అందరూ నిలకడగా ఆడారు. ప్రతి ఒక్కరూ రెండంకెల స్కోరు సాధించారు. దీంతో.. న్యూజిలాండ్ ఏ దశలోనూ… కంగారు పడలేదు. ఆడుతూ పాడుతూ .. విజయాన్ని అందుకుంది. గ్రాండ్‌హోమ్‌ 58 , లాథమ్‌ 32 , గుప్తిల్‌ 66, నికోల్స్‌ 80 పరుగులు చేశారు.

వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ వైఫల్యం టీమిండియాను గట్టి దెబ్బ తీసింది. వరుసగా మూడు వన్డే సిరీస్‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు కోహ్లీ. ఏడేళ్ల తర్వాత ఇలాంటి వైఫల్యం ఇదే తొలిసారి. ఐదు వన్డేల టీ ట్వంటీ సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేయగా.. మూడు వన్డేల సిరీస్ ను కివీస్ వైట్ వాష్ చేసింది. ఇక రెండు టెస్టుల సిరీస్ మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close