ఆఫ‌ర్లకూ ఆకాశ‌మే హ‌ద్దు

గురు సినిమాతో ఆక‌ట్టుకుంది సుధా కొంగ‌ర‌. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా పెద్ద హిట్ కాదు. పైగా రీమేక్‌. అందుకే సుధాకొంగ‌ర‌ని తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. హీరోలూ లైట్ తీసుకున్నారు. కానీ… సుధా కొంగ‌ర లోని ప్ర‌తిభ గుర్తించిన సూర్య ఆమెకు అవ‌కాశం ఇచ్చాడు. నిర్మాత‌గానూ తానే నిల‌బ‌డి  ప్రోత్స‌హించాడు. ఫ‌లిత‌మే… `ఆకాశం నీ హ‌ద్దురా`.

ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతి పంచింది. ఓటీటీలో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన సినిమాల్లో ఇదే బెస్ట్ అంటూ కితాబులు అందిస్తున్నారు. మెల్ల‌గా సెల‌బ్రెటీల‌కూ ఈ సినిమా కిక్ ఇవ్వ‌డం మొద‌లెట్టింది. ఈ సినిమా చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ `ఫెంటాస్టిక్‌` అంటూ తెగ పొగిడేశాడు. సుధా కొంగ‌ర‌తో ప‌నిచేయాల‌ని ఉందంటూ.. ట్వీట్ చేశాడు. ఇప్పుడు మ‌హేష్ బాబు వంతు వ‌చ్చింది. ఈసినిమా మ‌హేష్‌కీ న‌చ్చింది. దాంతో.. సూర్య న‌ట‌న గురించీ, సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించీ ట్వీట్ చేశాడు. అవ‌కాశం ఇస్తా.. అనే మాట అన‌లేదు గానీ, సుధా కొంగ‌ర వ‌ర్క్ మ‌హేష్‌కి న‌చ్చింద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంది. ఎప్ప‌టి నుంచో మ‌హేష్‌కి లేడీ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయాల‌ని ఆశ‌. ఆ విష‌యాన్ని కొన్నిసార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు త‌న‌కు మంచి ఆప్ష‌న్ దొరికిన‌ట్టైంది. `గురు` కోసం సుధా కొంగ‌ర‌తో ప‌నిచేసిన వెంక‌టేష్‌.. మ‌రోసారి త‌న‌తో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు టాక్‌. అంతేకాదు.. రానా కూడా.. `ఏమైనా క‌థ ఉంటే చూడు` అంటూ క‌బురు పంపాడ‌ట‌. ఇవ‌న్నీ ఎప్పుడు వ‌ర్క‌వుట్ అవుతాయి.. అస‌లు చేస్తారా?  లేదా అని ప‌క్క‌న పెడితే… టాలీవుడ్ హీరోల‌కు సుధా కొంగ‌ర రూపంలో ఓ మంచి ఆప్ష‌న్ క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close