అఫీషియ‌ల్‌: `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` లో ప‌వ‌న్

మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తాడా? లేదా? అనే సందేహానికి తెర‌ప‌డింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్ చేస్తున్నాడ‌న్న‌ది ఖ‌రారైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. ఈ రీమేక్ కోసంచాలా పేర్లు వినిపించాయి. కాక‌పోతే…. స్క్రిప్టు ప‌నుల‌న్నీ సాగ‌రే పూర్తి చేశాడు. కాక‌పోతే… సాగ‌ర్‌కి మ‌రికొన్ని క‌మిట్‌మెంట్స్ ఉండ‌డంతో.. సాగ‌ర్ త‌ప్పుకుంటాడ‌ని, అత‌ని స్థానంలో మ‌రొక‌రు వ‌స్తార‌ని అనుకున్నారు. చివ‌రికి మ‌ళ్లీ ఈ ప్రాజెక్టు సాగ‌ర్ చేతికే వెళ్లింది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. రెండో క‌థానాయ‌కుడిగా రానా న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దానిపై కాస్త క్లారిటీ రావ‌ల్సి వుంది. ప‌వ‌న్ చేతిలో చాలా సినిమాలున్నాయి. మ‌రి ఈ సినిమాని ఎప్పుడు మొద‌లెడ‌తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.