హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఆరెస్టు చేసిన డ్రగ్ డాక్టర్ పేరు చిగురుపాటి నమ్రత. ఆమె హైదరాబాద్‌లో ప్రమఖ ఆస్పత్రి ఒమెగా ఆస్పత్రి సీఈవోగా ఉన్నారు. స్వయంగా అంకాలజీ వైద్యం చేసే ఆమె క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణలో కీలకంగా ఉన్నారు. ఆమె తండ్రి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆయన కూడా ఆస్పత్రి నిర్వహణలో బిజీగా ఉంటారు. అయితే డాక్టర్ నమ్రత చిగురుపాటి మాత్రం దారి తప్పారు.
. పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి.. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాల్సి వచ్చింది. ముంబైలోని ఓ పబ్ లో ఆమెకు డ్రగ్స్ అలవాటు అయ్యాయి. డాక్టర్ నమ్రత ముంబై నుండి వాట్సాప్ ద్వారా వంశ్ ధక్కర్‌ను సంప్రదించి రూ.5 లక్షల విలువైన కొకైన్ ఆర్డర్ చేశారు. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో బదిలీ చేసి, వంశ్ కింద పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ బాలకృష్ణ అలియాస్ రాంప్యార్ రామ్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను డెలివరీ చేశారు.
సమాచారం అందడంతో రాయదుర్గం పోలీసులు గురువారం సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో మాదకద్రవ్యాలను అందజేసేటప్పుడు నమ్రత ,బాలకృష్ణ ఇద్దరినీ అరెస్టు చేశారు, వారు 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో డాక్టర్ నమ్రత ఏడాదిలో దాదాపు రూ.70 లక్షలు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు అంగీకరించారు.