లగడపాటి మళ్లీ తుస్..! ఇక సర్వేలు చేయరు…!

lagadapati-rajagopal
lagadapati-rajagopal

లగడపాటి రాజగోపాల్.. సర్వేల్లో పస లేదని మరోసారి తేలిపోయింది. మరోసారి ఆయన సర్వే పెయిలయింది. జాతీయ మీడియా చానళ్లు సర్వేల పేరుతో… ఎగ్జిట్ పోల్స్ పేరుతో… వైసీపీ గెలుస్తుందని ఉదరగొట్టినా ఆయన వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ఫలితాలు తేడా ఇచ్చినా వెనుకడుగు వేయలేదు. తన సర్వే తప్పయితే.. జీవితంలో సర్వేలు ప్రకటించనని చాలెంజ్ చేశారు. చివరికి ఇక సర్వేలు ప్రకటించని స్థితికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన రోజు నుంచి… ఓ రకమైన మౌత్ టాక్ ప్రారంభమయింది. దానికి కారణాలు ఏమైనప్పటికీ… టీడీపీ నేతల్లో మాత్రం.. ఓ రకమైన ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.

చివరికి లగడపాటి రాజగోపాల్ కూడా.. సర్వేను ప్రకటించినా.. సీ ఓటర్, ఐఎస్ఎస్ఎస్, టూడేస్ చాణక్య వంటి సంస్థల సర్వేల్లో… టీడీపీకి మంచి మెజార్టీ వస్తుందని తేలినా.. టీడీపీ నేతలకు ధైర్యం చిక్కలేదు. కారణం… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి చేసిన సర్వే సక్సెస్ కాకపోవడమే. పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంతో… లగడపాటి సర్వేలపై చాలా మంది నమ్మకం కోల్పోయారు. ఆ కారణంగానే ధైర్యంగా ఉండలేకపోయారు. తన విశ్వసనీయతకే… సమస్య రావడంతో.. లగడపాటి.. ఏపీ ఎన్నికల సర్వే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మళ్లీ టీడీపీనే గెలుస్తుందని చెప్పారు. చాలా మంది అనుకున్నట్లుగానే లగడపాటి సర్వే… ఫెయిల్ అయింది. మౌత్ టాక్ ను బట్టి ఫలితాలు రావని..లగడపాటి చేసిన వ్యాఖ్యలు… నిజం కాదనితేలిపోయింది. లగడపాటి.. చాలా కాలంగా సర్వేలు చేస్తున్నారు. ముఖ్యంగా 2014 పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు వెల్లడించారు. ఆంధ్ర, రాయలసీమలు ఒక యూనిట్‌గా, తెలంగాణ ఒక యూనిట్‌గా ఫలితాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కలిసి.. తెలంగాణలో టీఆర్ఎస్, దేశంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని అంచనా వేశారు. అదే జరిగింది.

అంతకు ముదు కూడా కూడా.. కరెక్ట్ గా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఫలితాలు తేడా వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమంయలో తొలిసారి లగడపాటి రాజగోపాల్ సర్వే తప్పయింది. ఆయన చెప్పినట్లు ఇండిపెండెంట్లు.. ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలవలేదు. టీఆర్ఎస్ కు అంచనా వేసిన సీట్ల కన్నా.. రెండింతలు ఎక్కువే వచ్చాయి. మహాకూటమి సీట్లకు… పొంతన లేకుండా పోయింది. అయితే.. లగడపాటి మాత్రం.. తన సర్వే తప్పవడానికి కారణాలను… త్వరలో చెబుతానని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన..తర్వాత..తన సర్వే నిజమయితే… విశ్వసనీయత పెరుగుతుందని.. అప్పుడు కారణాలు చెబుతానంటున్నారు. ఇప్పుడు… లగడపాటి సర్వే పోయింది. ఇక కారణాలు చెప్పాల్సిన పని లేదు. ఇక సర్వేలు ప్రకటించాల్సిన అవసరం రాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com