రాజమౌళి పొంగిపోయిన రికార్డ్ ఇది

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డులు, రివార్డులు, రికార్డులు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పుడు స్వయంగా జక్కన్న అనందంతో పొంగిపోయే ఫీట్ ఒకటి ట్రిపులార్ సొంతం చేసుకుంది. జపాన్ లో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘనత దక్కించుకుంది. జపాన్‌లోని 114 కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఒక పోస్టర్ చేశారు రాజమౌళి.

‘ఒకప్పుడు100 రోజులు, 175 రోజులు ఆడితే అది చాలా పెద్ద విషయం. ఆ రోజులన్నీ జ్ఞాపకాలే. కాలంతో పాటు బిజినెస్ తీరు మారింది. కానీ, ఇప్పుడు జపాన్‌లోని ప్రేక్షకులు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేశారు. మేము తిరిగి ఆ ఆనందాన్ని పొందేలా చేశారు. లవ్‌ యూ జపాన్‌’’అని ట్వీట్ చేశారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ జపాన్ లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close