భారత ప్రజాస్వామ్య పవర్ ఎలాంటిదో ప్రతి ఐదేళ్లకు ఓ సారి నిరూపితమవుతూనే ఉంటుంది. ఎన్నికలు జరిగిన ప్రతి సారి ప్రజలు గెలుస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించేది ప్రజలే. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా ప్రజలే శాసిస్తారు. అందుకే మా గెలుపు ప్రజల విజయం అని పార్టీలు అంటాయి. మా ఓటమి కూడా ప్రజలే. వినమ్రంగా స్వీకరిస్తాం అని ఓడిపోయిన పార్టీలు అంటాయి. కానీ కొన్ని తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి తీర్పు ఖచ్చితంగా ఏడాది కిందట 2024 జూన్ 4న వచ్చింది.
తుడిచిపెట్టుకుపోయిన అధికార పార్టీ
2024, జూన్ 3 వ తేదీ వరకూ రెచ్చిపోయారు. ప్రజలంతా బానిసలు. మేము అకౌంట్లలో పదివేలు వేశాం.. మాకు తప్ప ఎవరికి ఓటేస్తారని రెచ్చిపోయారు. దాడులు చేశారు. దౌర్జన్యాలు చేశారు. తప్పుడు సర్వేలతో హోరెత్తించారు. చివరికి మస్తాన్ అనే హాఫ్ నాలెడ్జ్ సర్వేయర్ కు డబ్బులిచ్చి తప్పుడు సర్వేలు ప్రకటించారు. పార్టీ క్యాడర్ ను బెట్టింగ్‌ల వైపు మళ్లించి వాళ్లను నిండా ముంచారు. ఎంతగా అంటే.. ఏ కోణంలో చూసినా కనీసం ప్రతిపక్ష నేత హోదా రానంతగా ఓడించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. జిల్లాలకు జిల్లాలు తుడిచిపెట్టుకుపోయారు. అధికార పార్టీకి మెజార్టీలు ఎక్కడా ఒక్కో నియోజకవర్గంలో యాభై వేలకు తగ్గనంత ఫలితం. ప్రజాగ్రహంతో అధికార పార్టీని తగలబెట్టేశారని కౌంటింగ్ ప్రారంభించిన గంటసేపటికే తేలిపోయింది.
ప్రజల్ని తక్కువ అంచనా వేసేవారికి ఇదే శిక్ష
ప్రజాస్వామ్యంలో మేమే తోపులం అని ఎవరైనా అనుకుంటే అంత కంటే అతిశయోక్తి ఉండదు. ఇతర ఆటల్లో గ్రౌండ్ లో కృషి చేస్తే.. పతకాలు గెలుస్తారేమో కానీ.. ప్రజాస్వామ్యంలో మాత్రం.. ఎవరి గెలుపును.. ఎవరి ఓటమిని ఆయన ప్రజలే డిసైడర్ చేస్తారు. అందుకే ఎప్పుడూ విజేతలు ప్రజలే. దాన్ని పట్టించుకోకుండా.. ప్రజాస్వామ్యాన్ని తక్కువ అంచనా వేస్తే.. పాతాళానికి పడిపోతారు. ప్రజల్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. కూటమి పార్టీలు అదే చేశాయి. కూటమికి పథకాల కోసం ప్రజలు ఓట్లు వేయలేదు. ఆ అరాచక పాలన నుంచి కాపాడమని వేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. తెలియనట్లుగా నటించే వారికీ తెలుసు.
రాజకీయ పార్టీలకు గుణపాఠం
ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలన్నింటికీ ఓ గుణపాఠం. అధికారం వచ్చింది కదా అని రెచ్చిపోకూడదు. దాడులు, దౌర్జన్యాలు, బూతులు అనేవి ఉండకూడదు. ప్రజల్ని గౌరవించాలి. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల్ని వంచించకూడదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరోసారి ఏపీ కింగ్ మేకర్ అయింది. ఏపీ ప్రయోజనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. అదే జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు తన అక్రమాస్తులు, కేసులు.. తన దోపిడీ నేతల రక్షణకే ప్రజాపవర్ ను వాడుకున్నారు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో.. వారు ఇచ్చే ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో మరోసారి చూపించి ఏడాది అయింది.