ఆన్ లైన్ కొనుగోళ్లపై అనుమానాలు

ఆన్ లైన్ షాపింగ్ ద్వారా నాణ్యమైన వస్తువు ఇంటికొస్తే ఆనందమే, లేదంటే నరకమే. కట్టేసిన డబ్బును వెనక్కి తెప్పించుకోవడానికి ఫీట్లు తప్పవు. ఆన్ లైన్ షాపింగ్ నిర్వహిస్తున్న ఇ-పోర్టళ్లపై కేసులు, కుంభకోణాలు లేవని అనుకోకూడదు. జాగ్రత్తలు పాటించకపోతే అంతా గందరగోళమే.

ఫ్లిప్ కార్ట్, అమాజాన్, స్నాప్ డీల్ లేదా మరొక ఇ-పోర్టల్నుంచో కొనుగోళ్లు చేసేటప్పుడు చాలామంది చిటికలో పనైపోయిందని హ్యాపీగా ఫీలైపోతుంటారు. కేవలం చేతిమునివేళ్ల కదలికలతో క్షణాల్లో ప్రాడెక్ట్ ని సెలెక్ట్ చేస్తూ, ఆన్ లైన్ ద్వారా అంతకంటే స్పీడ్ గా మనీట్రాన్సఫర్ చేసేసి ఓపనైపోయినట్లు ఆనందపడిపోతుంటారు. అంతా అనుకున్నట్టు జరిగితే సంతోషమే. పండుగరోజుల్లో మీ ఇంట్లో కొత్త వస్తువులు కళకళలాడుతుంటాయి. కానీ సర్వవేళలా అలాజరుగుతుందన్న గ్యారెంటీలేదు. ఫెస్టీవ్ సేల్స్ సాగిస్తున్న ఇ-పోర్టళ్లు నూటికినూరుశాతం మనకు రక్షణగా ఉంటాయన్న నమ్మకం అంతకంటేలేదు.

ఇటు చూస్తే ఫ్లిక్ కార్ట్, అటు చూస్తే అమాజాన్, మధ్యలో స్నాప్ డీల్ వగైరాలు.. ఈ ఫెస్టీవ్ సీజన్ లో ఆఫర్ల మోతమ్రోగిస్తున్నాయి. ఒకదానితో మరొకటి పోటాపోటీగా ఆఫర్లు, డిస్కౌంట్లు కుమ్మరిస్తూ ఆన్ లైన్ కస్టమర్స్ ని ఆకర్షించుకుంటున్నాయి. ఆఫీస్ లో కూర్చునిఉన్నా, కార్లో ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా ఆన్ లైన్ ఫర్చేజెస్ మీదనే ఇప్పుడుఅందరీ ఫోకస్. నలుగురు కలిస్తే ఇవే కబుర్లు. పండుగ రద్దీ ఎక్కువగా ఉండే షాపుల గడపతొక్కనక్కర్లేదు , అంతంత దూరాలు వెళ్ళాల్సిన అవసరం అంతకంటేలేదు. వస్తువుల కొనుగోళ్ల కోసం ఆఫీస్ కు సెలవు పెట్టాల్సిన పనేలేదు. అయినా కొత్త వస్తువులు ఇంటికివచ్చిపడుతుంటాయి. ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి ఇవన్నీ ప్లస్ పాయింట్స్.

ఇవి తెలుసుకోండి…

ఆన్ లైన్ షాపింగ్ చేసేవారు కొన్ని విషయాలు నిశితంగా గమనించాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అసలు మనం డబ్బు ఎవరికి చెల్లిస్తున్నాం? మనకు ఏ విధంగా ప్రాడెక్ట్ చేతికి అందుతుందన్న విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఈ దసరాలో ఇ-పోర్టళ్లు ప్రకటిస్తున్న మెగా ఆన్ లైన్ సేల్స్ విలవ తక్కువేమీకాదు. మనం చెల్లించే మొత్తం వందల, వేల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 125 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఆన్ లైన్ బిజినెస్ ఇంకా ఊపందుకుంటే లక్షలకోట్ల ఆన్ లైన్ వ్యాపారం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పండుగ సీజన్లలో డిస్కౌంట్లు, ఆఫర్లు ఎప్పుడూ ఉంటాయి. అయితే కస్టమర్స్ కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగువేయాలి. షాప్ ల్లో అయితే వస్తువును చూసి డబ్బు చెల్లించి అప్పటికప్పుడే సదరు వస్తువును ఇంటికి తెచ్చుకుంటాము. కానీ ఆన్ లైన్ పర్చేజింగ్ అలాకాదు. ఇది విర్చువల్ షాపింగ్. ఇక్కడ ప్రధానంగా ఉండాల్సింది ఇ-కామర్స్ పోర్టల్ పై నమ్మకం. అందుకే మనం ఎంచుకునే ఇ-పోర్టల్ విశ్వసనీయత ఎంత? అన్నది ఆలోచించాలి.

నమ్మకమే ప్రధానం

మనదేశంలో ప్రధానంగా అమాజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ల ద్వారా వస్తువుల అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయి. ఈ రెండు పోర్టళ్లకు విదేశీ పెట్టుబడులు పుష్కలంగా ఉండటంతో నాణ్యత, నమ్మకం పునాదులపై వాటిని నడిపిస్తున్నారు. అయినప్పటికీ వీటిపై కస్టమర్స్ ఫిర్యాదులు చేయడంలేదనో, కేసులు లేవనో అనుకోకూడదు. వేలకువేల రూపాయలు ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసేసినప్పుడు, ఒకవేళ సమయానికి ప్రాడెక్ట్ రాకపోయినా, వచ్చినప్పటికీ అది నాణ్యమైనది కాకపోయినా కొనుగోలుదారుడు పడే టెన్షన్ అంతాఇంతాకాదు. అందుకే ఇ-పోర్టళ్ల ద్వారా కొనుగోళ్లు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇ-కామర్స్ ని నిశితంగా గమనిస్తున్న నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇ-పోర్టళ్ల బాధ్యత ఎంత?

నిజానికి ఇ-పోర్టళ్లు నేరుగా ఉత్పత్తులను అమ్మడంలేదు. నిజానికి అవి ఉత్పత్తిచేసే సంస్థలు కానేకావు.. అంటే మనం కొనే వస్తువులకు తయారీ యజమానిగా ఈ వెబ్ సైట్లు వ్యవహరించడంలేదన్నది గుర్తించాలి. అవి కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తుంటాయి. వస్తువులు తయారుచేస్తున్న కంపెనీలకీ, వాటిని కొనుగోలు చేస్తున్నవారికీ మధ్య వారధిగా మాత్రమే ఉంటాయి. కేవలం విశ్వసనీయత ప్రమాణంగా కొనుగోలుదార్లు వీటిపై ఆధారపడుతుంటారు. మామూలుగా ఒక వస్తువు ఉత్పత్తి దారుని నుంచి వినియోగదారునికి చేరేముందు అనేకమంది మధ్యదళారులుంటారు. ప్రతి దశలో వారివారి కమిషన్ తీసుకుంటుండటంతోనూ, షాప్ ల మెయింటెన్స్ , వారి లాభాలను కూడా కలపడంతోనూ వస్తువు ధర చివరకు కస్టమర్ కు చేరేసమయానికి రెట్టింపు, ఒక్కోసారి ఇంకా ఎక్కువగా మారిపోతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే తయారీదారుడు ఎంఆర్పీ నిర్ణయిస్తాడు. ఇక్కడ ఆన్ లైన్ లో మధ్యదళారీ వ్యవస్థ తగ్గిపోతుంది. దీనితో బయట షాపుల్లో కంటే ఆన్ లైన్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న ప్రధాన అంశం ఇదే.

సెల్లర్ ఎవరో తెలుసుకోండి..

వస్తువులను విక్రయించే ఇ-కామర్స్ పోర్టళ్లు సదరు వస్తువులను తయారుచేయడంలేదన్న విషయం అర్థమైందికదా, అవి కేవలం తయారీదారులకూ కొనుగోలుదారులకు మధ్య వారధిగానే ఉంటాయి. కనుక మనం పర్చేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు వస్తువులను అధీకృతంగా అమ్మే కొనుగోలుదార్లను మాత్రమే ఎంచుకోవాలి. ఉదాహరణకు ఫ్లిప్ కార్ట్ పోర్టల్ తీసుకుందాం. ఇందులో పర్చేజ్ చేసేటప్పుడు WS Retail అనుబంధంగా మీ పర్చేజింగ్ డీల్ జరుగుతుందో లేదో చూసుకోవాలి. అలా చేస్తే నూటికినూరుశాతం సేఫ్ గా ఉన్నట్టే. అంటే, మీరు వస్తువును ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు సదరు వస్తువు WS Retail నుంచి నేరుగా మీకు వస్తుందోలేదో చూసుకోవాలి. చాలా సందర్భాల్లో WS Retail ప్రకటించే ధర అధీకృతంగానే ఉంటుంది. అయితే ధర కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ సేఫ్ గా ఉంటుందని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి ఫ్లిప్ కార్ట్ కి అనుబంధంగా ఉన్న ఈ రిటైల్ సంస్థ కస్టమర్స్ కి 30రోజుల్లోపు డబ్బు వాపసు గ్యారంటీ ఇస్తోంది. మిగతావి వారంపదిరోజుల్లో చెల్లిస్తామని చెప్పొచ్చు. ఫ్లిప్ కార్ట్ కి డబ్వ్యూఎస్ రిటైల్ ఎలాగో, అమాజాన్ కి ` క్లౌడ్ టెయిల్’ ఉంది. ఫ్లిప్ కార్ట్, అమాజాన్, స్నాప్ డీల్ పోర్టళ్లకు వేర్ హౌజ్ లున్నాయి. అక్కడే వస్తువులు రెడీగాఉంటాయి. థర్డ్ పార్టీ సెల్లర్ ద్వారా వచ్చేవి కూడా అక్కడే ఉంచుతారు. దీంతో కస్టమర్ డీల్ కుదుర్చుకోగానే షిప్పింగ్ చురుగ్గా జరుగుతుంది. అంటే చాలా సందర్భాల్లో మనం వస్తువు ఎంచుకోగానే నేరుగా సెల్లర్ దాన్ని మనకు అందించేందుకు రంగంలోకి దిగడు, అమాజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివే షిప్పింగ్ ప్రాసెస్ ని డీల్ చేస్తాయి. అవసరమైతే ఇ-కామర్స్ కంపెనీల వేర్ హౌజ్ ల నుంచి వస్తువులు కొనుగోలుచేసుకుని వాటిని కస్టమర్ ఇళ్లకు పంపిస్తుంటాయి.

shopping

రేటింగ్ ఎంత?

ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇంకో విషయం కొనుగోలుదారులు గుర్తించాలి. అదేమంటే, బై-బటన్ నొక్కేముందు వస్తువు అమ్మేవాడికి ఎంత స్థాయిలో కొనుగోలుదారులు రేటింగ్ ఇచ్చారన్నది తెలుసుకోవాలి. అలాగే, ఫీడ్ బ్యాక్ చూడాలి. అమ్మకందారునికి మంచి రేటింగ్ ఉంటే, ఆ కంపెనీ నిజాయితీని, విశ్వసనీయతను నమ్మవచ్చు. మరో విషయంఏమంటే, ఇ-బేలో `పైసాపే’ ద్వారా పేమెంట్ చేయడం చాలా సేఫ్. ఇ-బే లావాదేవీలు సాగించేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. `పైసాపే’ ద్వారా మనం కట్టే సొమ్ము, మనం కొనుక్కున్న వస్తువు చేతికి అంది, సంతృప్తి చెందిన తర్వాతనే సెల్లర్ కు చేరుతుంది. అప్పటి వరకు మనం కట్టిన డబ్బును ఇ-బే తన వద్ద ఉంచుకుంటుంది. ఏదైనా సమస్య వస్తే పరిష్కరిస్తుంది. అంటే మనకు వస్తువు నచ్చకపోయినప్పడు దాన్ని రిటర్న్ ఇచ్చేయాలనుకున్నప్పుడు డబ్బు పోతుందన్న భయం ఉండదు. అలా కాకుండా సెల్లర్ కు నేరుగా డబ్బుకడితే ఇ-బే ఎక్కువగా జోక్యంచేసుకునే పరిస్థితి ఉండదు.

చేదుఅనుభవాలు..

ఆన్ లైన్ షాపింగ్ ఎంత సరదాగా, క్విక్ జరిగిపోతుందో, ఒక్కోసారి అంతగా చేదు అనుభవాలను మిగులుస్తుంది. చాలా సందర్భాల్లో బాగా ఖరీదైన వస్తువును చాలా తక్కువకు వస్తుందని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేస్తారు. అది మన చేతికి వచ్చిన తర్వాత చూస్తే, ఆ వస్తువు విరిగిపోయిఉండవచ్చు. లేదా ప్యాక్ లో నకిలీ వస్తువో రాతి ఫలకాలో, ప్లాస్టిక్ ముక్కలో ఉండవచ్చు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వస్తువు విక్రేత నిజాయితీని గుర్తించే కొనుగోలు చేయడం ఒక్కటే పరిష్కారమార్గం. బాగా ఖరీదైన వస్తువుపై భారీగా డిస్కౌంట్ (50శాతంకంటే తక్కువ ధరకు)ఇస్తున్నప్పుడు, అమ్మకం సాగించే కంపెనీ విశ్వసనీయత సరిగ్గా లేనప్పుడు వాటి జోలికి పోకూడదు. ఖరీదైన వస్తువులను ఆన్ లైన్ ద్వారా కొనేటప్పుడు సాధ్యమైనంతవరకు `క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్ ఎంచుకుంటేనే మంచిది. అలాకాకపోతే చిక్కుల్లో పడాల్సివస్తుంది. వస్తువు డెలివెరింగ్ లో జాప్యం, లేదా కట్టిన డబ్బు తిరిగి చెల్లించడంలో జాప్యం, నాణ్యతలేని వస్తువులు అంటగట్టడం వంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలంటే కచ్చితంగా ముందుగానే జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగానే డబ్బును వెంటనే తిరిగిచెల్లించడంలేదు. వారి వద్ద కొంతకాలం ఉంచుకోవడం (వడ్డీలేని మొత్తంగా ఉంచుకోవడం) వంటివి కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఉద్దేశపూర్వకంగా నిలిపిఉంచిన డబ్బును కంపెనీలు వేరే ప్రయోజనాలకు వాడుకోవచ్చు. ఇలాంటి కుంభకోణాలు, అవకతవకలు జరిగినప్పుడు బాధితులు వినియోగదారుల ఫోరంలో కేసులు వేయవచ్చు. లేదా లీగల్ నోటీస్ ఇవ్వొచ్చు. అయితే ఇ-కామర్స్ సంబంధిత మోసాలు, నేరాలపై సరైన పాలసీ ఇంకా మనదేశంలో రాలేదు. దీనిపై కేంద్ర వాణిజ్, పరిశ్రమల మంత్రిత్వశాఖ పునరాలోచిస్తోంది.

డబ్బు మన చేయిదాటిపోయిన తర్వాత కోరుకున్న వస్తువు ఇంటికి చేరకపోతే అది నరకంతో సమానమే. అందుకే ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించగలగాలి. పూర్తి నమ్మకం చిక్కిన తర్వాతనే బై- బటన్ నొక్కాలి. అప్పుడే మీ ఇంట్లో చేరే వస్తువులు మీకెంతో ఆనందాన్ని పంచిపెడతాయి.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close