రాధేశ్యామ్‌… ఒకే ఒక్క పాట బాకీ!

మొత్తానికి రాధే శ్యామ్ ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. ఈనెల 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా.. రాధేశ్యామ్ టీజ‌ర్ విడుద‌ల కానుంది. అదే రోజు విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టిస్తారు. జూన్ 30న రాధే శ్యామ్ విడుదల అవుతుంద‌ని స‌మాచారం. ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింద‌ట‌. ఓ పాట మాత్ర‌మే.. బాకీ ఉంద‌ని. ఆ పాట‌ని త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. పాట‌తో పాటు.. పూజా హెగ్డేపై కొన్ని షాట్స్ షూట్ చేయాల‌ని, అందుకోసం మ‌రో రోజు స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. పాట‌కు 5 రోజులు.. పూజా కోసం మ‌రో రోజు. అంటే.. క‌నీసం ఆరు రోజుల్లో షూటింగ్ పూర్త‌యిపోతుంది. అయితే.. ఈ పాట‌కు ప్ర‌భాస్‌, పూజాల కాల్షీట్లు దొర‌కాలి. ఎందుకంటే.. పూజా ఫుల్ బిజీ. ప్ర‌భాస్ కూడా అంతే. ఓ వైపు స‌లార్‌, మ‌రోవైపు… ఆదిపురుష్‌. ఇలా రెండు వైపులా బిజీ. `రాధే శ్యామ్‌` ఎలాగూ జూన్‌లో విడుద‌ల అవుతుంది కాబ‌ట్టి, చాలా టైమ్ ఉన్న‌ట్టే లెక్క‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close