స‌మంత‌కు ఇదే ఫ‌స్ట్‌… ఇదే లాస్ట్‌

విడుద‌ల‌కు ముందు పుష్ప చాలా ర‌కాలుగా ఆక‌ర్షించింది. ఈ సినిమా ఎట్టిప‌రిస్థితుల్లోనూ చూడాల్సిందే అనే ఉత్సుక‌త‌ని పెంచింది. అందులో.. స‌మంత ఐటెమ్ సాంగ్ ఓ బ‌ల‌మైన కార‌ణం. పుష్ప‌లో స‌మంత ఐటెమ్ సాంగ్ చేస్తోంద‌న‌గానే ఆస‌క్తి మొద‌లైపోయింది. ఎందుకంటే.. స‌మంత అప్ప‌టి వ‌ర‌కూ ఐటెమ్ గీతం చేయ‌లేదు. అందుకే భ‌లే క్రేజ్ వ‌చ్చింది. స‌మంత స్థానంలో త‌మ‌న్నా, పూజా హెగ్డేలాంటి వాళ్లుంటే… ఈ పాట గురించి జ‌నం అంత‌గా మాట్లాడుకునేవాళ్లు కాదేమో. ఎందుకంటే.. త‌మ‌న్నా, పూజాల‌నే ఐటెమ్ గాళ్స్ గా చూసేశారు. మ‌రి ఈ పాట‌లో స‌మంత ఎలా క‌నిపించ‌బోతోంది? ఎన్ని హొయ‌లు ఒలికించ‌బోతోంది? అనే దిశ‌గా ప్రేక్ష‌కుల ఆస‌క్తి పెరిగింది. పైగా ఇది మ‌గాళ్ల మ‌నోభావాల్ని టార్గెట్ చేసిన పాట‌. దాంతో.. ఆ ర‌చ్చ కాస్త ఇంకో ట‌ర్న్ తీసుకుంది.

తీరా పుష్ప విడుద‌లైంది. ఇందులో స‌మంత పాట పెద్ద‌గా ఆన‌లేదు. విడుద‌ల‌కు ముందు ఉన్న బ‌జ్‌.. ఈ పాట చూస్తున్న‌ప్పుడు రాలేదు. అంతెందుకు… అస‌లు సమంత‌కి స‌రిగా ఫోక‌స్ చేయ‌లేదంటూ.. గుంపులో గోవింద‌మ్మ‌లా స‌మంత మారిపోయిందంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈమాత్రం పాట‌కు స‌మంత‌నే తీసుకోవాలా? అని అడుగుతున్నారంతా. సో.. స‌మంత ఈ సినిమాకి ప్ల‌స్ అవ్వ‌లేదు. ఈ పాట వ‌ల్ల స‌మంత‌కీ ప్ల‌స్ అవ్వ‌లేదు. పైగా.. ఐటెమ్ పాట‌లో న‌టించ‌డానికి ఒప్పించేందుకు సుకుమార్ నానా పాట్లూ ప‌డ్డాడ‌ట‌. ఈ పాట‌లో చేయ‌డానికి స‌మంత ససేమీరా అంద‌ని, స‌మంత‌ని ఒప్పించ‌డానికి చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించాన‌ని సుకుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే ఈ పాట చేయ‌డానికి స‌మంత అన్య‌మ‌స్కంగానే ఒప్పుకుంది. ఈ రిజ‌ల్ట్ బ‌ట్టి చూస్తే… స‌మంత కెరీర్‌లో ఇదే తొలి, చివ‌రి ఐటెమ్ పాట‌గా మిగిలిపోయే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగీలాలో చిరు – ర‌జ‌నీ – శ్రీ‌దేవి..?

రంగీలా... రాంగోపాల్ వ‌ర్మ త‌డాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళ‌ని ఈ సినిమా సూప‌ర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ క‌థ చిరంజీవి, ర‌జ‌నీ కాంత్, శ్రీ‌దేవిల‌తో చేయాల్సింద‌ట‌....

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close