మా నాయకుడు పవన్ కళ్యాణ్ కి బహిరంగ లేఖ

written by : Manideep T
Mail Id : manideep0808@gmail.com

అన్నా..పవన్ కల్యాణ్ అన్నా!

నీ కోసం పడి సచ్చిపొయె కొట్లాది అబిమానుల్లొ నేనొకడిని,నేనొక్కడినే. చేతిలో డబ్బు ఉన్నా లేకున్నా, నీ సినెమాలన్ని మొదటి ఆట చుడాల్సిందే. బాగున్నా లేకున్నా, కాలర్ ఎగరేసుకొని తిరిగేవాడిని. నీ సినేమాలు ఎన్నొ కొని చాలా నష్ట పొయాను, అయినా నీ మీద ఇష్టం ఒక్క శాతం కుడా తగ్గలేదు అన్నా. నువ్వంటే నాకు అంత పిచ్చి. I’m always proud to be a PSPK fan.

మీరు రాజకీయాల్లొకి వచ్చినప్పుడు, చాలా సంతోష పడ్డాను, ఆనందించాను. ఇక సామన్య ప్రజల కష్టాలు అర్దం చేసుకునే నాయకుడు వచ్చాడు రా అనుకున్నాను. ప్రశ్నించటానికి రాజకీయాల్లొకి వచ్చాను అని మీరు అన్నప్పుడు, ఇక తప్పు చేసిన వాళ్ళ తాట తీశ్తారనుకున్నాను. కాని మీరే తప్పుడు దారి పడతారు అని కలలొ కూడ అనుకోలేదు అన్నా. కొన్ని రొజులు గా జరుగుతున్న సంఘటనలన మూలాన, మీ నిజమైన అభిమానులమంతా చాలా మనస్తాపానికి గురైనాము. “అన్న కాంగ్రెస్ కి, తమ్ముడు బిజెపి కి అమ్ముడు పొయారు” అని అందరు అంటుంటే తట్టుకొలేకపొతున్నాం. కొన్ని రొజులుగా జరుగుతున్న సంఘటనలు వల్ల నేను చాలా మనోవేదన కి గురయ్యాను. మీరు వాటికి స్పందించిన తీరు ఇంకా భాద పెట్టింది. మీకు మా ఉద్దేస్యాన్ని తెలియజేయటానికి ఈ లేఖ రాస్తున్నాను.

మిమ్మల్ని అలా అనటం చాలా తప్పు. అలాంటి సెన్సిటివ్ విషయాన్ని అన్ని సార్లు టి.వి లో చూపించటం ఎలెక్త్రానిక్ మీడియా ది అంత కంతే తప్పు. ఆందుకొసం మీడియా కి తోలు తీసాము, అది చాలా మంచి విషయము. మెము చాలా సంతొషించాము. కాని అన్న, నాకు అర్థం కానిది ఎంటంటే..mana party prasninchataniki puttindi kada, anduke prasninstunna anna..

  • నిజానికి TV9 వాళ్ళు ఆ పదాన్ని బీప్ చేసి ప్రసారం చేసారు అన్న. ఫొరెన్సిక్ రిపొర్ట్ ప్రకారం, TV9 వీడియొ ని టెంపెర్ చేసి, మనం దాన్ని మొర్ఫ్ చేసి ట్వీట్ చేయటం ఎంత వరకు న్యాయం? పొలిటికల్ మైలేజ్ కొసమే మీరు వారిని అనవసరంగా దూషించారని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు అన్న.
  • ఆన్నది శ్రీ రెడ్డి, అనిపించింది రాం గొపాల్ వర్మ, లీక్ అయిన ఆడియొ టేపుల్లో ఉన్నది వై.సి.పి వాళ్ళు..శ్రీ రెడ్డి చాలా సంవత్సరాలు సాక్షి చానెల్ లొ పని చేసింది. రాం గొపాల్ వర్మ NTR కి వ్యతిరేకంగా లక్ష్మిపార్వతి కి ఫేవరబుల్ గా సినెమా తీస్తున్నాడు, దానికి నిర్మాత వచ్చి వై.సి.పి కి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి వై.సి.పి వాళ్ళతో ఇంత చనువు ఉండగ..మీరేమో దేనికి సంబందం లేని TDP వాళ్ళని తిడుతున్నారు ? ఎందుకు అలా?
  • మనకి స్పెషల్ స్టాటస్ విషయం లొ అన్యాయం చేసింది BJP కదా అన్న. మీరెమొ BJP ని ఒక్క మాట కుడా అనకుండా అంతా TDP మీద పడుతున్నారేంటి అన్న ? తప్పు చేసిన BJP ని అనటం మానేసి, TDP మీద పొరాటం దేనికి అన్న?
  • మీకు మొడీ అప్పొంట్మెంట్ ఇవ్వట్లేదు అని ఒక ఇంటెర్వ్యు లొ చెప్పారు కదా అన్న..ఇప్పుడు ట్విట్టెర్ లో చేసిన రచ్చ అంత మొడీ మీద చేయచ్చు కదా అన్న, అప్పుడు అయనే దిగి వస్తాడు. అలాంటి పొరాటన్ని ట్విట్టెర్ లో మొడీ పై చెయచ్చు కదా? మీ వెంట మేమంతా ఉన్నాము, ఎల్లప్పుడు ఉంటాము. మీరు అలా చేస్తే, రాష్ట్ర గవర్నమెంటు వారు కుడా కదిలి వస్తారు, మీకు మద్దతు పలుకుతారు.
  • 16 మార్చ్ న మన మీటింగ్ లో లొకేష్ ని తిట్టారు, ఆ తర్వాత నేషనల్ మీడియా ముందర ..”వారి వీరి నొట విన్నాను..నాకు పక్కా గా తెలియదు” అని అన్నారు. ఆలా పూర్తిగా తెలుసుకొకుండా ఇంకొకర్ని నిందించకూడదని, తప్పుడు మాటలతో ఎవ్వరిని బాధ పెట్టకూడదు అని మన Pawanism లొ అనుకున్నాం కదా. మీరు మాకు చెప్పే Pawanism ని మీరే మర్చిపోతే ఎలా అన్నా? Pawanism అని అక్షరాలు రాస్తుంటే, నా వళ్ళు అంతా గూస్ బుంప్స్ వస్తున్నాయి అన్న. మీరంటే అంత ఇష్టం నాకు.
  • ఓక ట్వీట్ లొ 6 నెలలు నుంచి TDP వాల్లు హింసుస్తున్నారు అని అన్నారు, ఇదంత మొదలయింది మార్చ్ 16 తర్వాతనే కదా అన్న. మరి 6 నెలలు నుంచి ఎలా ?
  • ప్రజల సొమ్ము కొన్ని వేల కొట్లు తినేసిన వాళ్ళని ఏమి అనకుండా, ప్రజల కొసమే అహిర్నిశలు పని చేస్తున్న వాళ్ళని తిట్టటం మన Pawanism కి వ్యతిరేకం కదా అన్నా?
  • అనర్గళంగా తెలుగు మాట్లాడే ఒక వ్యక్తి నాకు తెలుగు సరిగ్గా రాదు అని అందరి ముందు అబద్దం చెప్పి, మనల్ని మొసం చెస్తుంటే నా ఒళ్ళు మండిపొతుంది అన్న.

మా మదిలో ఉన్న ఈ ప్రశ్నలకి సమాదానం ఇచ్చి మమ్మల్ని మీ ఆలొచనా విదానానికి దగ్గరగా వచ్చేట్టు చేయవల్సిందిగా మా విన్నపం.

కూతురికి పెళ్ళి చేసి అల్లుడు దగ్గరకి పంపించిన తర్వాత, ఆ అల్లుడు మన కుతురి ని సరిగ్గా చూస్కొకపోతే ..మనం ఎం చెస్తాం అన్న? ఫస్ట్ అల్లుడు దగ్గరకి వెళ్ళి మంచిగా చెప్పి చూస్తాము, బుజ్జగిస్తాం.. వినకపొతే బ్రతిమాలుకుంటాము..చాలా జగ్రత్త గా వ్యవహరించాలి ఎందుకు అంటే కూతురి జీవితం అతని చేతిలో ఉంది కాబట్టి..ఎంత చెప్పినా వినకపొతే..అప్పటకీ మారకపొతే ఎదురించి అల్లుడికి బుద్ది చెప్తాము.. CBN చేసింది కుడా అదే అన్న.. మన రాష్ట్రం కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి లాంటిది. BJP అల్లుడు లాంటిది. BJP – Centre దయ తొనె రాష్ట్రం బాగుంటది. ఆది అర్దం చేసుకున్న CBN గారు, మొదట బుజ్జ గించారు, బ్రతిమిలాడారు, అమ్మాయి జీవితం లాంటిది అయిన మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని అల్లుడు చెప్పిన ప్రతి మాట ని నమ్మి చివరికి మొసపొయారు.. ఆకరికి అల్లుడు నిజస్వరూపం తెలుసుకొని ఎదురు తిరిగారు. ఈ విషయం లొ అయన్ని తప్పు పట్టడం సరి కాదు అన్న. మాములుగా అయితే కూతురు కోసం కష్టపడే తండ్రి ని అందరం ఇష్తపడతాము. కాని ఇది నీచమయిన రాజకీయం కదా అన్న, కూతురు అయిన రాష్ట్రాన్ని తండ్రి స్థానం లో ఉండి కాపాడటానికి ప్రయత్నిస్తున్న CBN గారిని మనం నిందుస్తున్నాం. పాపం ఆ తండ్రి!

మొసం చెసిన అల్లుడు ని వదిలేసి, కూతురి జీవితం కొసం అహిర్నిసలు కష్త పడుతున్న తండ్రి ని మీరు నిందించటం చుస్తుంటే చాలా భయమేస్తుంది అన్న, ఈ నీచమయిన రాజకీయాల కోసం మీరు మీ నిజాయతిని కొల్పొయారేమొ అని. ఈ దరిద్రమయిన రాజకీయాల కొసం మీరు మీ నిజాయతిని కొల్పొవల్సిన పరిస్తితి వస్తే..వద్దు అన్న మనకి ఈ చెత్త కుప్ప. వెల్లిపొయి సినెమాలే చేసుకుందాం. మాకు మా నిజాయతి గల పవర్ స్టార్ ని కొల్పొవాలని లేదు.

ఇదంతా పక్కన పెడితే, ఒక చదువుకున్న వాడి గా నాకు తెలిసి.. CBN చాలా visionary leader అన్న, మీరు ఒక పవర్ హౌస్ అన్న. మీరిద్దరు కలిసి పని చేసి ముందుకెల్తే మన రాష్ట్రనికి ఎంతో మేలు కల్గుతుంది అని మా అందరి గట్టి నమ్మకం అన్న. ఆయన, ఆల్ పార్టీస్ మీటింగ్ కి పిలిచినప్పుడు మీరు వెళ్ళుంటే చాలా బాగుండేది అన్న.. ఒక్క సారి అలొచించండి, మీ లాంటి గొప్ప వ్యక్తి BJP కి అమ్ముడు పొయారు అంటే నేను నమ్మను..కాని మీ బీహెవియరు ఆ మాటలకి దగ్గర గా ఉండటాన్ని తట్టుకొలేకపొతున్నాను. మీ ఇద్దరిని కలిసి ముందుకు వెళ్ళమన్నానని, ట్డ్ఫ్ వారు నాతొ ఈ లెఖ రాయిస్తున్నరని ఎవరొ ఒక బుద్ది లేని వెధవ అంటాడు, మీరు ఆ మాటలని నమ్మి మిమ్మల్ని మీరు మొసం చెసుకోవద్దు. ఈ రాష్ట్రం బాగుండాలి అని గట్టిగా కొరుకునే ఒక సామాన్యుడిని, మీ వీరాభిమానిని నేను.

మీకు ఇలా చెప్తున్నందుకు నన్ను ద్వేషించద్దు అన్న. మీ అన్న గారు చిరంజీవి గారు ఎవైన చిన్న తప్పులు చేసినప్పుదు మీరు ఒక రెస్పాన్సిబుల్ తమ్ముడు గా అయనకి మీ భావాలను తెలియజేసి ఉంటారు. ఆలాగే మీరు ఎదైనా తప్పు చెస్తున్నారేమో అని భయం వేసినప్పుడు, నా భావన ని మీకు చెప్పే స్వేచ్చ, మిమ్మల్ని ప్రశ్నించే అధికారం..మిమ్మల్ని నిజయతీగా ఇష్ట పడే మీ ఫాన్ గా, మీ తమ్ముడి గా నాకు ఉందని గట్టిగా నమ్ముతున్నాను. నాది తప్పు ఉంటే నన్ను క్షమించండి. తప్పు చేసిన వాళ్ళని ఎదురించటం అతి త్వరలో చేస్తారని, మీ మాటల్లొ ఉన్న నిజాయతీ మీ చేతల్లొ కుడా కనిపించాలని కోరుకుంటున్నాను.

మీరు బాగుండాలి, మీ వల్ల మన రాష్ట్రం బాగుండాలి.

We want SCS! AP needs justice! Lets together fight against BJP!

రాష్ట్ర మేలు కోరుకునే మీ వీరాభిమాని,

Manideep

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. The facts and opinions appearing in the article do not reflect the views of Telugu360 and Telugu360 does not assume any responsibility or liability for the same.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close